Begin typing your search above and press return to search.

'కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు'.. 'ఇందువదన' నుంచి రెట్రో సాంగ్..!

By:  Tupaki Desk   |   18 Aug 2021 12:16 PM GMT
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు.. ఇందువదన నుంచి రెట్రో సాంగ్..!
X
వరుణ్ సందేష్ - ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''ఇందువదన''. MSR దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌ పై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వ‌రుణ్ - ఫ‌ర్నాజ్ శెట్టి ఫస్ట్ లుక్ - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు' అనే సాంగ్ లిరికల్ వీడియోని మాస్ డైరెక్టర్ వివి వినాయక్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

'కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు.. గుండెల్లోకి దూరిపోయి చూడు.. నాలో నిన్ను తొంగి చూడు.. హాయి హాయిగా చూడు..' అంటూ సాగిన ఈ పాట వీక్షకులను అలరిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ శివ కాకాని సమకూర్చిన బాణీలకు.. గేయ రచయిత భాస్కరభట్ల రవి కుమార్ మంచి సాహిత్యం అందించారు. ఈ గీతాన్ని ఎస్పీ చరణ్ - సాహితీ చాగంటి ఆలపించారు. ఎస్పీ చరణ్ కొన్ని చోట్ల తన తండ్రి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని గుర్తు చేశారు. ఈ సాంగ్ కు గణేష్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటోంది. రెట్రో గెటప్స్ లో ఉన్న వ‌రుణ్ సందేశ్ - ఫ‌ర్నాజ్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది.

''ఇందువదన'' చిత్రానికి సతీష్ ఆకేటీ కథ - మాటలు అందించారు. బి. మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో రఘు బాబు - అలీ - నాగినీడు - సురేఖ వాణి - ధనరాజ్ - తాగుబోతు రమేష్ - మహేష్ విట్ట - పార్వతీషం - వంశీ కృష్ణ ఆకేటి - దువ్వాసి మోహన్ - జ్యోతి - కృతిక - అంబఋషి - 'జెర్సీ' మోహన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.