Begin typing your search above and press return to search.

అందాల నాయిక బేబి బంప్ ప్ర‌ద‌ర్శ‌న‌

By:  Tupaki Desk   |   23 Dec 2019 7:36 AM GMT
అందాల నాయిక బేబి బంప్ ప్ర‌ద‌ర్శ‌న‌
X
నిరంత‌ర ఫోటోషూట్ల‌ తో అంత‌ర్జాలం పై విరుచుకు ప‌డే నాయిక‌ గా బాలీవుడ్ బ్యూటీ క‌ల్కి కొచ్లిన్ పాపుల‌ర్. ఇటీవ‌ల ఇన్ స్టాలో త‌న ఫోటోగ్రాఫ్స్ అభిమానుల్లో ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇక ట్రెండింగ్ డిజైన‌ర్ దుస్తుల్లో క‌ల్కి రెగ్యుల‌ర్ గా ట్రీటిస్తుంటుంది. అంత‌కుమించి వేరొక ఫోటోషూట్ తో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా క‌ల్కి 6 నెల‌ల బేబి బంప్ ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. మరో మూడు నెల‌ల్లో క‌ల్కి ఓ బేబీకి జన్మ‌నివ్వ‌బోతోంది. ఆ క్ర‌మంలోనే ఇదిగో ఇలా బేబి బంప్ ఫోటోషూట్ తో సెన్సేష‌న్స్ కి తావిస్తోంది. ఇక కల్కి కొచ్లిన్ ఇంత‌కు ముందు భ‌ర్త అనురాగ్ క‌శ్య‌ప్ కి విడాకులిచ్చిన సంగ‌తి తెలిసిందే. అటుపై గ‌య్ హ‌ర్ష్ బగ్ అనే యువ‌కుడి తో ప్రేమాయ‌ణం సాగిస్తోంది. ఆ క్ర‌మంలోనే తాజా బేబి బంప్ ఫోటోషూట్ హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవ‌ల అందాల క‌థానాయికలు స‌మీరా రెడ్డి.. బ్రిటీష్ బ్యూటీ ఎమీజాక్స‌న్ బేబి బంప్ అనుభ‌వాల్ని అభిమానుల‌తో షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నిండు గ‌ర్భిణిగా ఉన్న‌ప్ప‌టి ఫోటోల‌ తో పాటు మ‌మ్మీ అయ్యాక కూడా రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌ ను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తూ అభిమానుల‌కు టచ్ లో ఉన్నారు. ఇప్పుడు క‌ల్కి కొచ్లిన్ వంతు అన్న‌మాట‌!