Begin typing your search above and press return to search.
ప్రేమికుల రోజున సర్కారు వారి 'కళావతి' పాట..!
By: Tupaki Desk | 7 Feb 2022 5:25 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరూ' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మహేష్ నుంచి రాబోతున్నఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 12న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే 'సర్కారు వారి పాట' సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ - SVP బ్లాస్టర్ - స్పెషల్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిన మేకర్స్.. ఫిబ్రవరి 14న 'కళావతి' అనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తునన్నట్లు ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ.. ప్రేమికుల దినోత్సవాన్ని మరింత స్పెషల్ గా మారుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
'కళావతి' పాటకు సంబంధించి ఫిబ్రవరి 9 - 11 మరియు 14 తేదీలలో మరికొన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇకపోతే 'సర్కారు వారి పాట' చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్ర ఖని - ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.