Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా మూవీకోసం కాలభైరవ గాత్రం!

By:  Tupaki Desk   |   28 April 2021 6:01 AM GMT
పాన్ ఇండియా మూవీకోసం కాలభైరవ గాత్రం!
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. అగ్రదర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ క్యారెక్టర్లతో సినిమా రూపొందుతుంది. టాలీవుడ్ స్టార్స్ రాంచరణ్ తేజ్ అల్లూరిగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ సినిమాను సాలిడ్ బడ్జెట్ తో డీవీవి దానయ్య నిర్మిస్తున్నారు. అయితే గతేడాది కాలంగా సినిమా గురించి ప్రేక్షకులు నిరీక్షస్తున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా వాయిదా పడుతూ ఆలస్యం అవుతూ మొత్తానికి అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉండగా.. రాజమౌళి ప్రతి సినిమాకు ఎంఎం కీరవాణి మాత్రమే సంగీతం అందిస్తాడని తెలిసిందే. ఈసారి కూడా ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ అదిరిపోతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ ఎమోషనల్ పాటను కీరవాణి కుమారుడు యంగ్ టాలెంటెడ్ కాలభైరవ పాడినట్లు తెలుస్తుంది. ఆ పాట సినిమాకే హైలైట్ కాబోతుందని టాక్. మరి ఇదివరకు బాహుబలిలో కూడా ఎమోషనల్ సాంగ్ తో ఆకట్టుకున్నాడు కాలభైరవ. ఆ పాట సినిమాలోనే హైలైట్ అయింది. మరి ఈసారి కూడా అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి. అలాగే కాలభైరవ ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా బిజీ అవుతున్నాడు. ఇటీవలే కలర్ ఫోటో, తెల్లవారితే గురువారం అనే సినిమాలకి సంగీతం అందించాడు.