Begin typing your search above and press return to search.

షారుక్ అండర్ రేటెడ్ నటుడట

By:  Tupaki Desk   |   10 Dec 2015 4:00 AM IST
షారుక్ అండర్ రేటెడ్ నటుడట
X
బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుఖ్ కి వున్న ఫాలోయింగ్ సాదాసీదాకాదు. అతని చెయ్యి ఊపే సంజ్ఞకోసం రోజూ తన ఇంటిముందు వందలమంది పడిగాపులుగాస్తారు పాతికేళ్ళ క్రితం నటించిన ప్రేమకధలు వంటి సరంజామాతోనే ఇప్పటికీ నటిస్తున్నాడంటే అది షారుఖ్ కే చెల్లింది.

అయితే షారుఖ్ బయట ప్రపంచానికి తెలిసినదానికంటే గొప్ప నటుడని తన తోటి నటి కాజోల్ అభిప్రాయపడింది. నిజానికి షారుఖ్ ని సూపర్ స్టార్ గా కొలుస్తారుగానీ నా వరకూ అతనొక అండర్ రేటెడ్ యాక్టర్ అని తీర్పునిచ్చేసింది. అంతేకాక షారుఖ్ బిరుదుని కింగ్ ఆఫ్ బాలీవుడ్ నుండి కింగ్ ఆఫ్ యాక్టింగ్ కి మార్చాలని అభిప్రాయపడింది.

గతంలో ఎన్నో సూపర్ హిట్ లు సాధించిన ఈ జోడీ మై నేమ్ ఈజ్ ఖాన్ తరువాత ఇప్పుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో దిల్ వాలే సినిమాతో క్రిస్మస్ సందర్భంగా మన ముందుకు రానుంది.