Begin typing your search above and press return to search.

హీరోయిన్ కోసం బీఫ్‌ డిష్‌ వండాడు

By:  Tupaki Desk   |   1 May 2017 9:39 AM GMT
హీరోయిన్ కోసం బీఫ్‌ డిష్‌ వండాడు
X
కొత్త ‘లా’ ఏమి వచ్చినా ఏ ‘రూల్’ వచ్చినా కామన్ మెన్ కన్నా ముందు పాటించవలిసినది ఎవ్వరూ అంటే ... అవును వారే.. మీకు గుర్తుకు వచ్చింది సరైనవారే.. ఫిల్మ్ స్టార్స్. ప్రస్తుతం అఫీషియల్ గా రూల్ కాకపోయినా.. బీఫ్‌ బ్యాన్ అనేది కనిపించకుండానే చాలా చోట్ల నడుస్తోంది. కాని ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం ఓపెన్ గా బీఫ్‌ డిషెస్ గురించి డిస్కస్ చేస్తోంది. మీడియా ఇంటారాక్షన్లలో కానీ ఫిల్మ్ స్టార్ ఇంటర్వ్యూ లో కానీ ఇలా బీఫ్ బ్యాన్ పై చర్చలు జరుగుతున్నాయ్. కొంత మంది వీటి పైన జోక్ లు కూడా వేస్తున్నారు.

ఆడవాళ్ళ రక్షణ కన్నా ఆవులు రక్షణ ఎక్కువైందని సెటైర్లు పడుతున్న సమయంలో.. ఒక బాలీవుడ్ స్టార్ నటికి బీఫ్‌ తినడానికి చిన్న ఇబ్బంది వచ్చింది. బాలీవుడ్ లో అందరికీ ఇష్టమైన హీరోయిన్ కాజోల్ తన ఫ్రెండ్ ర్యాన్ కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడ ఒక డిష్ ని చూసి ఇబ్బంది పడింది. ఆ డిష్ మొత్తం బీఫ్ వంటకాలుతో నిండి ఉంది. వెంటనే తన చమత్కారముతో బాగానే నెట్టుకువచ్చింది. ఇదే ఏంటి వీడు తినకూడనివి ఇచ్చాడు తినడానికి అని అనేసి నవ్వేసింది. మరి తిన్నదో లేదో తెలియదులే.

ఏదేమైనా కూడా.. నేను బ్రాహ్మిణ్‌ అయినా కూడా బీఫ్‌ తింటున్నా అని ఓపెన్ గా డిక్లేర్ చేసిన శృతి హాసన్ ను చూసి మన హీరోయిన్లు అందరూ నేర్చుకోవాల్సిందే. ఇక కామన్ పబ్లిక్ అంటారా.. రుచి బాగుండాలే కాని తినడానికి ఏముందిలే అంటున్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/