Begin typing your search above and press return to search.

సౌత్ పై కన్నేసిందా!?

By:  Tupaki Desk   |   10 July 2017 5:34 PM GMT
సౌత్ పై కన్నేసిందా!?
X
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్.. చాలా కాలం తర్వాత సౌత్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. 2017లో రాజీవ్ మీనన్ దర్శకత్వంలో మెరుపుకలలు మూవీలో నటించిన కాజోల్.. మళ్లీ 20 ఏళ్ల తర్వాత సౌత్ మూవీ చేస్తోంది. సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన మూవీ వీఐపీ2లో నటిస్తోంది ఈ 40+ బ్యూటీ.

అయితే.. తను దక్షిణాది సినిమాల్లోకి నటించకపోవడంపై కారణాలు వివరించింది కాజోల్. 'నాకు తెలియని భాషలో నటించడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా కంఫర్ట్ జోన్ ను దాటి వర్క్ చేసేందుకు పెద్దగా ఇష్టపడను. అయితే.. వీఐపీ2 విషయంలో సౌందర్య.. ధనుష్ లు నన్ను ఒప్పించారు. తీరా సెట్స్ పైకి వచ్చిన తర్వాత నాకు సెట్ అయేందుకు 3 రోజుల సమయం పట్టింది. ప్రతీ రోజూ 2గంటలకు పైగా నా డైలాగ్స్ కు సంబంధించిన వర్క్ ను.. ఓ అసిస్టెంట్ సహాయంతో పూర్తి చేసేదాన్ని' అని చెప్పింది కాజోల్. వీఐపీ2 చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ భామకు.. ఇలా విలన్ రోల్స్ చేయడం కొత్తేమీ కాదు. తను హీరోయిన్ గా వెలిగిపోతున్న సమయంలో గుప్త్ అంటూ థ్రిల్లర్ లో విలన్ గా నటించింది కాజోల్.

ఇప్పుడు వీఐపీ2లో నటించిన తర్వాత సౌత్ సినిమాలపై మక్కువ పెరిగిందన్న కాజోల్.. తమిళ్ తో పాటు ఇతర దక్షిణాది భాషలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిపింది. అలాగే.. తనకు మంచి పాత్రలు ఆఫర్ చేస్తే.. తెలుగులో నటించేందుకు అభ్యంతరం లేదని చెప్పింది బాలీవుడ్ భామ కాజోల్. నిజానికి అమ్మడికి బాలీవుడ్ లో పెద్దగా ఛాన్సులు ఏవీ లేవు. అందుకే ఇప్పుడు ఇలా సౌత్ పై తెగ ప్రేమ ఒలకబోస్తోంది. మరి రెమ్యూనరేషన్ విషయంలో పేచీ పెట్టకపోతే మనోళ్ళు కూడా ఎగబడే ఛాన్సుంటుందిలే.