Begin typing your search above and press return to search.

కాజోల్ మెరుపుక‌ల‌ల్ని కూతురు నిజం చేస్తుందా?

By:  Tupaki Desk   |   14 April 2021 3:05 AM GMT
కాజోల్ మెరుపుక‌ల‌ల్ని కూతురు నిజం చేస్తుందా?
X
సంచ‌ల‌నాల `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` చిత్రంతో షారూక్ కి ఎంతటి పేరొచ్చిందో క‌థ‌నాయిక‌ కాజోల్ కి అంతే గొప్ప గుర్తింపు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా రిజ‌ల్ట్ త‌ర్వాత‌ అగ్ర క‌థానాయిక‌గా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. ఆ త‌రవాత సౌత్ లోనూ ఈ భామ అవ‌కాశాలు అందుకుంది. ఇక్క‌డ మెరుపుక‌ల‌లు చిత్రంలో ప్ర‌భుదేవా-అర‌వింద స్వామి లాంటి స్టార్ల తో న‌టించి మెప్పించింది.

ఇక అజ‌య్ దేవ‌గ‌న్ ని పెళ్లాడిన కాజోల్ కి నైసా దేవ్ గ‌న్ అనే కుమార్తె ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ భామ వెండితెర‌కు ప‌రిచ‌య‌మవుతుందా? అంటే ఇంకా స్కూల్ స్ట‌డీస్ లోనే కొన‌సాగుతోంది. తాజాగా కాజోల్ కుమార్తె నైసా దేవ‌గన్ తన పాఠశాల ఈవెంట్ లో డ్యాన్సులు చేస్తున్న వీడియో ఒక‌టి వైర‌ల్ గా మారింది. ఇందులో నైసా ప్ర‌ద‌ర్శ‌న కాజోల్ అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

నైసా దేవ్‌గన్ తన పాఠశాల కార్యక్రమంలో గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలో కాజోల్ సూపర్ హిట్ పాటలను ప్రదర్శించింది. కాజోల్ హిట్ మూవీ కబీ ఖుషి కబీ ఘమ్ నుండి బోలే చుడియాన్ సాంగ్ ని ఎంపిక చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం. మై నేమ్ ఈజ్ ఖాన్ నుండి సజ్దా సాంగ్ ని ఎంపిక చేయ‌గా.. జబ్ వి మెట్ నుండి నగదా నగదా.. సాంగ్ కి పెర్ఫామ్ చేశారు. గ్రూప్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లో నైసా గ్రీన్ స్కర్ట్ లో కనిపించింది.

ఈ వీడియో సింగపూర్ లోని నైసా పాఠశాలలో చిత్రీక‌రించిన‌ది. అక్కడ కొన్ని సంవత్సరాలుగా నైసా చదువుతోంది. త‌న‌ స్నేహితులతో క‌లిసి ఆ వీడియోలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. సోషల్ మీడియాలో అభిమానులు ప్రోత్సాహ‌కంగా వ్యాఖ్యలు చేశారు. కొంతమంది అభిమానులు నైసా అచ్చం కాజోల్ లానే న‌ర్తిస్తోంద‌ని పొగిడేశారు.

భ‌విష్య‌త్ లో నైనా ఎలాంటి కెరీర్ ని ఎంచుకుంటారు? అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్ఠ‌త లేదు. అజయ్ దేవ్‌గన్ - కాజోల్ నైసాను ప్ర‌స్తుతానికి మీడియా దృష్టికి దూరంగా ఉంచారు. హిందీ చిత్ర పరిశ్రమలో ప్ర‌వేశిస్తుందా లేదా? అన్న‌దానికి ఆమె ప్రణాళికలను వెల్లడించలేదు.

గత సంవత్సరం లాక్ డౌన్ స‌మ‌యంలో నైసా సింగ‌పూర్ నుంచి ముంబైకి వ‌చ్చేసింది. ముంబైలో అజయ్- కాజోల్ త‌న‌ సోదరుడు యుగ్ తో కలిసి ఉంది. లాక్ డౌన్ ఎత్తివేశాక‌ సెప్టెంబరులో నైసా సింగపూర్ తిరిగి వెళ్లింది. ఆమెతో పాటు కాజోల్ కూడా ఉన్నారు.

కా‌జోల్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. త్రిభంగ లో ఆస‌క్తిక‌ర‌ పాత్రను పోషించారు. అయితే ఈ చిత్రం విమర్శకులు ప్రేక్షకుల మెప్పు పొంద‌లేదు. అజయ్ ప్ర‌స్తుతం సూర్యవంశీ- గంగూబాయి కతియావాడి- ఆర్‌.ఆర్.‌ఆర్- మైదాన్ - భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా- థాంక్స్ గాడ్- మేడే సహా ఏడు చిత్రాల్లో న‌టిస్తున్నారు. వీటిలో చాలా రిలీజ్ కి రానున్నాయి.