Begin typing your search above and press return to search.

కాజోల్ తిన్న‌ది బీఫ్ కాదు.. మ‌రేమంటే..?

By:  Tupaki Desk   |   2 May 2017 6:22 AM GMT
కాజోల్ తిన్న‌ది బీఫ్ కాదు.. మ‌రేమంటే..?
X
బాలీవుడ్ డ‌స్కీ బ్యూటీల్లో సీనియ‌ర్ న‌టి కాజోల్ అంద‌మే వేరు. పిల్ల‌ల త‌ల్లి అయిన‌ప్ప‌టికీ.. ఆ మ‌ధ్య‌న షారూక్ తో న‌టించి హాట్ హాట్ గా క‌నిపించి గుండెల్లో గుబులు పుట్టించిన ఈ భామ అనుకోని రీతిలో ఒక వివాదంలో చిక్కుకుంది. ముంబ‌యిలో జ‌రిగిన ఒక పార్టీకి వెళ్లిన ఆమె.. ఆ పార్టీలో బీఫ్ వంట‌కాల్ని వ‌డ్డించిన‌ట్లుగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

దీనిపై విమ‌ర్శ‌లు రావ‌ట‌మే కాదు.. ఆమెను తిడుడూ.. హెచ్చ‌రిస్తూ ప‌లువురు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేయ‌టంపై కాజోల్ రియాక్ట్ అయ్యారు. తాను తిన్న‌ది బీఫ్ (గో మాంసం) ఎంత‌మాత్రం కాద‌ని చెప్పారు.అంద‌రూ అనుకున్న దానికి వాస్త‌వానికి సంబంధం లేద‌ని.. తాను బీఫ్ తిన‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

త‌న స్నేహితురాలు రియాన్ స్టీఫెన్ ఇచ్చిన పార్టీలో బీఫ్ అస్స‌లు వ‌డ్డించ‌లేదంది. తాను తిన్న‌ది బ‌ఫెల్లో మాంస‌మ‌ని.. దానిపై ఎలాంటి నిషేధం లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేసింది. తాను పోస్ట్ చేసిన వీడియోలో క‌నిపించింది బీఫ్ కాదు.. బ‌ఫెల్లో వంట‌కంగా చెప్పింది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని.. అందుకే వివ‌ర‌ణ ఇస్తున్న‌ట్లుగా పేర్కొంది. ఈ విష‌యం మీద రియాక్ట్ కాక‌పోతే.. ఇత‌రుల మ‌త విశ్వాసాలు దెబ్బ తినే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో తాను రియాక్ట్ అయిన‌ట్లుగా పేర్కొంది.

ఈ ఎపిసోడ్‌ లో త‌న చేతులు న‌రికేయాలంటూ వ్యాఖ్యానించిన వారిపై విరుచుకుప‌డింది. తాజా వివ‌ర‌ణ అనంత‌రం.. పార్టీ ఇచ్చిన ఆమె స్నేహితురాలి చేతులు న‌ర‌కాలంటూ కొంద‌రు పోస్టులు పెట్ట‌టంతో తన వివ‌ర‌ణ‌ను డిలీట్ చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈపార్టీకి కాజోల్ మాత్ర‌మే కాదు.. మ‌లైకా అరోరా.. దియామిర్జా.. ఇత‌ర సినీ ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. చిక్కంతా ఎక్క‌డ వ‌చ్చిందంటే.. తాను తిన్న దాన్ని పోస్ట్ రూపంలో పెట్ట‌టం.. ఆ ఫుడ్ కాస్తా బీఫ్ గా అనిపించ‌టంతో ఈ మొత్తం వివాదం షురూ అయ్యింది. తింటే తిన‌క‌.. లేనిపోని వివాదాల్ని కొని తెచ్చుకోవ‌టం అంటే ఇదేనేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/