Begin typing your search above and press return to search.

కాజల్‌ పెళ్లికి ఇండస్ట్రీ మీడియాకు ఆహ్వానం లేదు

By:  Tupaki Desk   |   16 Oct 2020 11:00 AM IST
కాజల్‌ పెళ్లికి ఇండస్ట్రీ మీడియాకు ఆహ్వానం లేదు
X
కాజల్‌ అగర్వాల్‌ మరో రెండు వారాల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతాను అంటూ ప్రకటించిన కాజల్‌ అగర్వాల్‌ పెళ్లికి మాత్రం సినిమా పరిశ్రమ నుండి ఎవరిని ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా పెళ్లి భారీగా కాకుండా పెద్ద కన్వెన్షన్‌ లో కాకుండా సింపుల్‌ గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగబోతుందట. పెళ్లికి రెండు వైపుల కుటుండాలకు చెందిన 20 నుండి 30 మంది గెస్ట్‌ లు మాత్రమే రాబోతున్నట్లుగా ఇటీవల ఒక జాతీయ మీడియా కథనంలో పేర్కొంది.

సాదారణంగా స్టార్స్‌ పెళ్లిని కవర్‌ చేసేందుకు మీడియా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. పెళ్లిని లైవ్‌ ఇవ్వడం లేదంటే ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేయడం వంటివి చేస్తారు. కాని కాజల్‌ పెళ్లి వేడుకకు సంబంధించి ఎలాంటి కవరేజ్‌ మీడియాకు ఇవ్వబోవడం లేదట. పెళ్లి తర్వాత మూడు నాలుగు ఫొటోలను మీడియా కోసం కాజల్‌ లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసే అవకాశం ఉంది.

పెళ్లి వీడియోను కూడా పూర్తిగా కాకుండా మూడు నాలుగు నిమిషాల నిడివితో విడుదల చేస్తారట. కాజల్‌ పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది కాస్త మింగుడు పడని విషయమే అయినా కరోనా పరిస్థితుల కారణంగా తప్పదని కుటుంబ సభ్యులు అంటున్నారు.