Begin typing your search above and press return to search.
నాగార్జునతో రొమాన్స్ చేయబోతున్న కాజల్..!
By: Tupaki Desk | 17 March 2021 6:00 AM ISTపెళ్లి మూడ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసింది కాజల్. కిచ్లూను మ్యారేజ్ చేసుకున్న తర్వాత హనీమూన్ ఎంజాయ్ మెంట్ మొదలు అన్నీ కంప్లీట్ చేసుకున్న ఈ భామ.. బ్యాక్ టూ సెట్స్ అంటూ ఫీల్డ్ మీదకు వచ్చేసింది. ఇప్పటికే చేసుకున్న కమిట్ మెంట్స్.. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన బ్యాక్ లాగ్స్ అన్నీ ఫినిష్ చేసేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే.. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కంప్లీట్ చేసింది. మంచు విష్ణు 'మోసగాళ్లు' కూడా ఫినిష్ చేసింది. అంతేకాదు.. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లోనూ బిజీగా పాల్గొంటోందీ బ్యూటీ. ఇక, నెక్స్ట్ కింగ్ నాగార్జునతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది.
నాగార్జున - దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబోలో ఓ చిత్రం అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేయడానికి కాస్త టైం తీసుకున్న దర్శకుడు.. ఈ మధ్యనే మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ షూట్.. గోవాలో కొనసాగుతోంది. ఈ టీమ్ తో త్వరలో జాయిన్ కాబోతోంది కాజల్.
మార్చి 31 నుంచి హైదరాబాద్ లో జరిగే కొత్త షెడ్యూల్ ద్వారా సెట్స్ లో అడుగ పెట్టబోతోంది కాజల్ కిచ్లూ. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించిందీ అమ్మడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.