Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: చుక్కల డ్రెస్ లో చక్కని చుక్క

By:  Tupaki Desk   |   9 May 2019 11:21 AM IST
ఫోటో స్టొరీ: చుక్కల డ్రెస్ లో చక్కని చుక్క
X
టాలీవుడ్ చందమామ కాజల్ ను మనం సామాజిక మాధ్యమాల సీతాకోకచిలుక అనాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిని ఈమధ్య సోషల్ మీడియా బటర్ ఫ్లై అంటున్నారు. దాన్ని తెలుగీకరణ చేస్తే ముందు మనం అనుకున్నదే అవుతుంది. మరి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉంటే రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చెయ్యాలి. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్ ఇవ్వాలి కదా?

అందుకే కాజల్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు కాజల్ ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే "సోమరితనానికి సమ్మర్ లో గౌరవం దక్కుతుందట." కాస్త తీవ్రంగా ఆలోచించి చూస్తే అది నిజమే అనిపిస్తుంది కదా? స్టూడెంట్స్ కు హాలిడేస్.. ఇంట్లో ఏం పని చేయకుండా కూర్చున్నా ఏమీ అనలేరు. ఇక ఎండల్లో బైటకు వెళ్తే.. తిరిగి ఇంటికి వస్తారో లేక అలానే నాన్ రిటర్నబుల్ టికెట్ తీసుకొని పైకి పోతారేమో అన్నంతగా వేడి ఉంది. చాలామంది జనాలు పేపర్లలో.. టీవీల్లో చూపించే 44-45 డిగ్రీల ఉష్నోగ్రతలను నమ్మడం లేదు.. ఇంకా రెండుమూడు డిగ్రీలు ఎక్కువే ఉన్నాయని వారి బుర్రలో అనుమానం. అలాంటప్పుడు ఇంట్లో సోంబేరిగా కూర్చుంటే గౌరవమే కదా?

క్యాప్షన్ సంగతి పక్కన పెడితే.. ఫోటోలో కాజల్ డ్రెస్ అదిరిపోయింది. వైట్ పై చాకొలేట్ రంగు చుక్కలుండే టాప్.. కింద అదే డిజైన్ ఉండే ప్యాంట్ ధరించి.. ఒక కుర్చీపై తాపీగా కూర్చుంది. స్లీవ్ లెస్ టాప్ వేసుకోవడంతో చందమామ తీరైన అందాలు నెటిజనులకు కనువిందు చేస్తున్నాయి. చుక్కల డ్రెస్ వేసుకున్న చక్కని చుక్క లా ఉంది. అసలే హాట్ సమ్మర్.. ఇలాంటి హాట్ పోజులు ఇస్తే నెటిజనులు ఊరుకుంటారా? వారు సోమరిగా అలానే చూస్తూ ఉండకుండా మూడు లక్షల లైకులు కొట్టారు. 1400 కామెంట్లు పెట్టారు. ఒకరు కాజల్ ను 'కోహినూర్ వజ్రానివి నువ్వు" అన్నారు. మరొకరు "లవ్ యూ స్వీట్ కాజు" అంటూ కాజల్ కు మరో ముద్దు పేరు పెట్టాడు.