Begin typing your search above and press return to search.

వెంకీ -రానాల‌తో నిషా అగ‌ర్వాల్ కంబ్యాక్

By:  Tupaki Desk   |   18 Aug 2021 8:00 AM IST
వెంకీ -రానాల‌తో నిషా అగ‌ర్వాల్ కంబ్యాక్
X
టాలీవుడ్ లో స్టార్ హీరోలు వ‌రుస‌గా వెబ్ సిరీస్ ల‌కు క‌మిట‌వుతున్నారు.ద‌గ్గుబాటి హీరోలు వెంకటేష్ .. రానా దగ్గుబాటి నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ల‌లో న‌టించ‌నున్నార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. దీనిపై అధికారిక ధృవీకరణ లేదు కానీ మీడియాలో పుకార్లు షికార్ చేశాయి. మంచి క‌థ కుదిరితే న‌టించేందుకు త‌మ‌కు అభ్యంత‌రాలేవీ లేవ‌ని ఆ ఇద్ద‌రూ చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. ఎట్ట‌కేల‌కు న‌చ్చే స్క్రిప్టు దొరికింది.

తాజాగా ఈ వెబ్ సిరీస్ గురించి మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం తెలిసింది. ఈ సిరీస్ లో ఓ కీలక పాత్ర కోసం కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సంప్రదించార‌ని తెలిసింది.

నిషా తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. వ‌రుణ్ సందేశ్ స‌ర‌స‌న‌ ఏమైందీ ఈ వేళ చిత్రంలో నారా రోహిత్ స‌ర‌స‌న సోలో చిత్రంలో న‌టించింది. ఇవి రెండూ హిట్ చిత్రాలు. సుకుమారుడు- స‌ర‌దాగా అమ్మాయితో త‌దిత‌ర‌ సినిమాల్లో నటించింది. 2013 లో వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాలకు దూర‌మైంది. ఎట్ట‌కేల‌కు బాబాయ్ - అబ్బాయ్ ల‌తో నిషా తిరిగి కంబ్యాక్ కానుంది. త‌న‌ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంది.