Begin typing your search above and press return to search.
టీజర్లో కాజల్ చేసిన బోల్డ్ యాక్టే కారణం!
By: Tupaki Desk | 7 Aug 2019 12:30 PM ISTకెరీర్లో ఇప్పటిదాకా పక్కా లేడీ ఓరియెంటెడ్ సినిమా ఒక్కటీ చేయలేదు కాజల్ అగర్వాల్. తొలిసారిగా ఆమె బాలీవుడ్ మూవీ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో లీడ్ రోల్ చేసింది. ఇదే చిత్రాన్ని తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ రీమేక్ అయింది. ఐతే వాటితో పోలిస్తే కాజల్ సినిమాకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. దీని టీజర్ కు యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ తో పోలిస్తే.. మిగతా మూడు వెర్షన్ల వ్యూస్ సమానంగా ఉండటం విశేషం. ఇందుకు టీజర్లో కాజల్ చేసిన బోల్డ్ యాక్టే కారణం. ఆ షాట్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఇదొక్కటే కాదు.. సినిమాలో మరికొన్ని బోల్డ్ యాక్ట్స్ కూడా ఉన్నాయట. అవే ఇప్పుడు ‘ప్యారిస్ ప్యారిస్’కు సెన్సార్ చిక్కులు తెచ్చిపెట్టాయి.
‘క్వీన్’ రీమేక్ వెర్షన్లు నాలుగింటినీ ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్. అందుకోసం వేర్వేరు భాషల్లో సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్లారు. ఐతే మిగతా మూడు భాషల్లో ఈజీగా సెన్సార్ అయిపోయింది. సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ తమిళ వెర్షన్ దగ్గరే ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని సన్నివేశాలు, డైలాగుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఐతే సెన్సార్ బోర్డు చెప్పినట్లు కోతలు వేయడానికి చిత్ర బృందం అంగీకరించలేదు. రివైజింగ్ కమిటీకి వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకోవాలని దర్శక నిర్మాతలు ఫిక్సయ్యారు. సినిమాలో కీలకమైన దృశ్యాలకు కోత వేయమని చెప్పడంతో చిత్ర బృందం నిరాకరించినట్లు తెలుస్తోంది. తమిళ వెర్షన్ కు కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించాడు. కన్నడ వెర్షన్ కూడా ఆయనే తీశాడు. తెలుగులో ఈ చిత్రం తమన్నా ప్రధాన పాత్రలో ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో తెరకెక్కిన సంగతి తెలిసిందే.