Begin typing your search above and press return to search.

'ఆచార్య‌' నుంచి కాజ‌ల్ అవుట్ కానీ..

By:  Tupaki Desk   |   25 April 2022 9:30 AM GMT
ఆచార్య‌ నుంచి కాజ‌ల్ అవుట్ కానీ..
X
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం `ఆచార్య‌` ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 29న భారీ స్థాయిలో థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. చ‌ర‌ణ్ కు జోడీగా పూజా హెగ్డే న‌టించిన మూవీపై స‌ర్వ‌త్రా అంచ‌నాలు నెల‌కొన్నాయి. చిరు, చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన తొలి చిత్రం కావ‌డం.. అంతే కాకుండా చిరు నుంచి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత వస్తున్న సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే ప్రేక్ష‌కుల‌తో పాటు చిరు అభిమానులు ఆస‌క్తిగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇందులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంద‌ని ముందు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. సెట్ లో కాజ‌ల్ భ‌ర్త‌తో క‌లిసి సంద‌డి చేసింద కూడా. అంతే కాకుండా కాజ‌ల్ లంగా వోణీ ధ‌రించ‌గా ఆమెపై కొన్ని స‌న్నివేశాల్ని కూడా చిత్రీక‌రించారు. అయితే తాజాగా ఆమె పాత్ర‌కు ప్రాధాన్య‌త లేద‌ని, అలాంటి పాత్ర‌లో ఆమెని చూపించ‌డం ఇష్టం లేకే ఆ పాత్ర‌ని పూర్తిగా సినిమా నుంచి తొల‌గించామ‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తాజాగా వెల్ల‌డించి మెగా ఫ్యాన్స్ తో పాటు కాజ‌ల్ అభిమానుల‌కూ షాకిచ్చారు.

మ‌రి చిరుకు జోడీగా హీరోయిన్ ఎవ‌రు లేక‌పోతే ఎలా అన్న‌ది ఇప్ప‌డు మెగా అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. ఇంత బారీ చిత్రంలో చిరుని హీరోయిన్ లేకుండా ఆయ‌న‌న మార్కు డ్యాన్సులు లేకుండా ఎలా చూపించ‌బోతున్నార‌ని అభిమానుల్లో ఇప్ప‌డు హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా వుంటే మెగా అభిమానుల కోసం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. `ఆచార్య‌` నుంచి కాజ‌ల్ తొల‌గించ‌డంతో ఆ లోటుని భ‌ర్తీ చేయ‌డం కోసం క్రేజీ హీయిన్ అనుష్క‌ని రంగంలోకి దింపిన‌ట్టుగా తెలుస్తోంది.

కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రెగ్నెంట్ కావ‌డం, పైగా ఆమె పాత్ర‌కు క‌థ‌లో పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో కాజ‌ల్ ని ఈ సినిమా నుంచి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌ప్పించేశాడు. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డంతో ఇప్ప‌డు కాజ‌ల్ టాపిక్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే అనుష్క‌ని రంగంలోకి దింపేసిన కొర‌టాల ఈ సినిమా కోసం ఆమెపై ఓ ప్ర‌త్యేక గీతాన్ని చిత్రీక‌రించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

బాహుబ‌లి త‌రువాత బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలైన `భాగ‌మ‌తి`, `నిశ్శ‌బ్దం` చిత్రాల్లో న‌టించింది అనుష్క‌. ఈ రెండు చిత్రాల త‌రువాత క్రేజీ చిత్రాల్లో న‌టించ‌డం త‌గ్గించేసింది. ప్ర‌స్తుతం న‌వీన్ పొలిశెట్టి హీరోగా యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ సైలెంట్ గా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇందులో న‌టిస్తూనే చిరు చిత్రంలోని ప్ర‌త్యేక గీతంలో అనుష్క క‌రిపించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని చెబుతున్నారు.