Begin typing your search above and press return to search.

ఆ సినిమాలో కాజల్‌ సోలో హీరోయిన్‌ కాదు

By:  Tupaki Desk   |   2 Dec 2020 2:30 PM GMT
ఆ సినిమాలో కాజల్‌ సోలో హీరోయిన్‌ కాదు
X
కెరీర్‌ చివరి దశకు చేరుకుంది అనుకుంటున్న ప్రతి సారి కూడా కాజల్‌ అగర్వాల్‌ అనూహ్యంగా ఆఫర్లు దక్కించుకుని మళ్లీ బిజీ అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. తమిళంలో దీకయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్‌ సినిమా. ఈ సినిమాలో కాజల్‌ తన నట విశ్వ రూపం చూపించబోతున్నట్లుగా తమిళ మీడియా సర్కిల్స్‌ లో వార్తలు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్‌ సినిమా అవ్వడంతో కాజల్‌ కూడా నయన్‌ రేంజ్‌ లో ముందు ముందు ఒక ఊపు ఊపే అవకాశం ఉంటుందని అంటున్నారు.

కాజల్‌ నటిస్తున్న ఆ హర్రర్‌ మూవీ గురించి తమిళ మీడియాలో కొత్త వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో కేవలం కాజల్‌ మాత్రమే కాకుండా మరో ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా నటించబోతున్నారు. కాజల్‌ రేంజ్‌ హీరోయిన్స్‌ కాకున్నా కూడా ఒక మోస్తరు హీరోయిన్స్‌ ను సినిమాలో నటింపజేస్తున్నట్లుగా చెబుతున్నారు. దాంతో ఈమెకు ఆశించిన స్థాయిలో పేరు రాదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు హీరోయిన్స్‌ లో ఒక హీరోయిన్‌ గా నటిస్తే ఆమెను పెద్దగా జనాలు పట్టించుకుంటారా అనే అనుమానాలు కలుగక మానవు.

ఇక కాజల్‌ తెలుగులో చిరంజీవికి జోడీగా ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈమె మంచు విష్ణు తో చేసిన సినిమా పూర్తి అయ్యింది. మరో వైపు తమిళంలో 'ఇండియన్‌ 2' ను చేస్తోంది. త్వరలోనే సినిమా షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నారు. వచ్చే ఏడాది ఒక బాలీవుడ్‌ సినిమాను కూడా ఈమె చేసేందుకు కమిట్‌ అయ్యింది. పెళ్లి తర్వాత కూడా వరుసగా ఈమె సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల తర్వాత ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.