Begin typing your search above and press return to search.

కాజల్‌ కాంట్రవర్సీ మూవీ రెడీ టు రిలీజ్‌

By:  Tupaki Desk   |   28 Jun 2021 12:30 AM GMT
కాజల్‌ కాంట్రవర్సీ మూవీ రెడీ టు రిలీజ్‌
X
బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయ్యి కంగనా రనౌత్‌ కు అవార్డులు రివార్డులు తెచ్చి పెట్టిన మూవీ క్వీన్‌. కాస్త ఆలస్యంగా క్వీన్‌ ను సౌత్‌ లో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యారు. సౌత్‌ లోని నాలుగు భాషల్లో కూడా ఒకేసారి రీమేక్ ను వేరు వేరు హీరోయిన్స్ తో మొదలు పెట్టారు. అన్ని భాషల్లో కూడా ఏదో ఒక సమస్య కారణంగా విడుదలకు క్వీన్‌ రీమేక్ లు నోచుకోలేదు. తెలుగు లో తమన్నా హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా ను ఏదో కారణం వల్ల ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఇక తమిళంలో కూడా ఈ సినిమా రీమేక్‌ ను పూర్తి చేసినా విడుదలకు సెన్సార్‌ సమస్య వచ్చింది.

సినిమాలో కొన్ని బూతు సన్నివేశాలు ఉండటంతో పాటు.. అసభ్యకరంగా డైలాగ్స్ ఉన్నాయట. వాటిని తొలగించేందుకు మేకర్స్‌ నో చెప్పడంతో సెన్సార్ సర్టిఫికెట్‌ రాలేదు. దాంతో థియేటర్‌ రిలీజ్ కు వెళ్లలేదు. థియేటర్లు లేని ఈ సమయంలో ఓటీటీల వైపు అంతా చూస్తున్నారు. సెన్సార్‌ సమస్య ఉన్న ఈ సినిమా ను డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు. అతి త్వరలోనే ఓటీటీతో చర్చలు ముగించి విడుదల తేదీని ప్రకటించేందుకు గాను తమిళ క్వీన్‌ మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

తమిళ క్వీన్‌ రీమేక్‌ కు ప్యారిస్‌ ప్యారిస్‌ అనే టైటిల్‌ ను పెట్టారు. ఈ సినిమాలో కాజల్ లుక్‌ విభిన్నంగా ఉండటంతో పాటు ఇప్పటికే విడుదల అయిన టీజర్‌ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కనుక ఖచ్చితంగా ఈ సినిమా ఓటీటీ ద్వారా పాజిటివ్‌ రెస్పాన్స్‌ ను దక్కించుకుంటుందేమో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్యారిస్‌ ప్యారిస్‌ సినిమా ఓటీటీ రిలీజ్ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.