Begin typing your search above and press return to search.

కాజల్ ను సడెన్‌ గా వదిలేసింది ఆ ఒక్క హీరోనే!

By:  Tupaki Desk   |   29 Sept 2016 11:00 AM IST
కాజల్ ను సడెన్‌ గా వదిలేసింది ఆ ఒక్క హీరోనే!
X
"పంచదార బొమ్మ" నుంచి నిన్నటి "నేను పక్కా లోకల్.. పక్కా లోకల్" వరకూ తెలుగు ప్రేక్షకులను అలరించడంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంచి మార్కులే కొట్టేసింది. చూడటానికి అందం - అమాయకత్వం కలగలిపినట్లు ఉండే ఈ టాలీవుడ్ చందమామపై అభిప్రాయం.. జనతాకి ముందు - జనతా తర్వాతలా మారిపోయింది. ఎందుకంటే ఈ సినిమాలోని "పక్కా లోకల్" పాటలో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు మరి. అయితే ఏమనుకుందో ఏమో కానీ, ఈ పాట తర్వాత ఇంక ఐటం సాంగ్స్ చేయనని చెప్పేసింది. అయితే తాజాగా బాగా ఉపయోగించుకుని తనని సడన్ గా వదిలేసిన వ్యక్తి గురించి స్నేహితులవద్ద చెప్పిందట కాజల్.

బాలీవుడ్‌ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నసమయంలో కాజల్ అగర్వాల్ కు షాహిద్ కపూర్‌ తో ఒక సినిమా సెట్టయ్యిందట. అయితే, ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నసమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. ఈ చనువుతో తనవద్ద ఉన్న లగ్జరీ కారును షాహిద్ కపూర్ విపరీతంగా వాడుకున్నాడని, అయితే ఉన్నట్లుండి సినిమా ఆగిపోవడంతో సడెన్‌ గా మాట్లాడటం మానేశాడని చెపుకొచ్చిందట కాజల్. బిజీగా ఉన్నాడేమోలే అనుకుంటే.. కనీసం ఫోన్ కూడా చేయడం, తీయడం మానేశాడని చెప్పి ఫీలవుతుందట. తనతో ఆ స్థాయిలో చనువుగా ఉన్న ఒకే ఒక వ్యక్తి, సడెన్‌ గా మాట్లాడడం మానేసిన ఒకే ఒక వ్యక్తి కూడా షాహిదే అని చెప్పి బాదపడుతుందట ఈ చందమామ.

అయితే ఇప్పుడు ఈ విషయంపై బాలీవుడ్‌ జనాలు గుసగుసలాడుతున్నారట. కాగా, ఈ మధ్య కాలంలో కాస్త వెనకబడినట్లు అనిపించినా... టాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్‌ గానే చలామణి అవుతున్న కాజల్ ప్రస్తుతం చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్‌ గా చేస్తుంది.