Begin typing your search above and press return to search.

మా హీరోయిన్ ను చెల్లిని చేశావా.. అంటున్నారుః విష్ణు

By:  Tupaki Desk   |   8 March 2021 5:27 PM IST
మా హీరోయిన్ ను చెల్లిని చేశావా.. అంటున్నారుః విష్ణు
X
మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం ‘మోసగాళ్లు’. బ్యాంకును కొల్లగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన కాజ‌ల్‌.. ఈ మూవీలో విష్ణు చెల్లిగా నటిస్తోంది. అయితే.. కాజ‌ల్ త‌న చెల్లిగా న‌టిస్తుండ‌డంపై కొంద‌రు హీరోలు కామెంట్ చేస్తున్నార‌ని చెప్పాడు విష్ణు.

మొద‌టగా కాజ‌ల్ పాత్ర‌కు ప్రీతిజింతాను అడిగార‌ట‌. కానీ.. ఓ బ‌ల‌మైన కార‌ణం చెప్పి, ఆమె న‌టించ‌లేన‌ని చెప్పింద‌ట‌. అమెరికాకు సంబంధించిన మ‌నీ స్కామ్ కావ‌డంతో తాను చేయ‌లేన‌ని చెప్పింద‌ట ప్రీతి. త‌న ఫ్యామిలీ మొత్తం అమెరికాలో ఉంటోంద‌ని, ఇలాంటి సినిమాలో న‌టిస్తే బాగుండ‌ద‌ని చెప్పింద‌ట‌. దీంతో.. కాజల్ ను అప్రోచ్ అయినట్టు వెల్లడించాడు విష్ణు.

అయితే.. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ, సిస్టర్ పాత్రలో నటించడానికి కాజల్ వెంటనే ఒప్పుకుంద‌ని చెప్పాడు విష్ణు. కాగా.. ఈ విష‌య‌మై ప‌లువురు హీరోలు ఆట‌ప‌టిస్తున్నార‌ని చెప్పాడు మంచు హీరో. మా సినిమాల్లోని హీరోయిన్ ను సిస్ట‌ర్ గా మార్చేశావా? అని ఫ‌న్నీగా అడుగుతున్నార‌ని చెప్పాడు. అయితే.. ఈ సినిమాలో కాజ‌ల్ పాత్ర త‌న క్యారెక్ట‌ర్ క‌న్నా చాలా కీల‌మైంద‌ని తెలిపాడు విష్ణు.

దాదాపు రూ.50 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టితోపాటు న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర ముఖ్య‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఏవీఏ ఎంట‌ర్ టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యాన‌ర్ల‌పై విష్ణు స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇదిలాఉండ‌గా.. ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి ముందే 10 నిమిషాల మూవీని ప్రేక్ష‌కుల‌కు చూపించ‌బోతున్నారు. త‌ద్వారా క్యూరియాసిటీ పెంచి, థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.