Begin typing your search above and press return to search.

అదే రూట్లో.. కాజల్‌ అండ్‌ తమన్నా

By:  Tupaki Desk   |   1 Jun 2016 7:00 AM IST
అదే రూట్లో.. కాజల్‌ అండ్‌ తమన్నా
X
కెరియర్‌ చివరకు చేరిన దశలో ఎవరైనా కూడా ఏమన్నా వినూత్నమైన సినిమాలు చేయాలనుకుంటారు. ఎందుకంటే అలాంటి సినిమాలు హిట్టయితే కెరియర్‌ ఇంకో నాలుగైదు సంవత్సరాలు సాగుతుంది హ్యాపీగా. అవును.. మనం చెప్పేది హీరోయిన్ల గురించే. ఇప్పుడు సమంత రూట్లో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఫాలో అవ్వనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక సినిమా 'జనతా గ్యారేజ్'. ఈ సినిమా తరువాత అమ్మడు కన్నడలో వచ్చిన ''యు టర్న్'' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోంది. మీరే ప్రొడ్యూస్ చేస్తారా అంటే? 'ఏమో ఎవరికి తెలుసు. ఏదైనా జరగొచ్చు' అని చెప్పింది స్యామ్‌. ఇప్పుడిక ఇదే బాటలో పయనించాలని మరో ఇద్దరు హీరోయిన్లు డిసైడ్‌ అయ్యారట. ఏదైనా సింగిల్‌ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ స్ర్కిప్టు తగిలితే.. దానిని తమకు తెలిసిన వారితో ప్రొడ్యూస్‌ చేయించి.. తామే లీడ్‌ రోల్‌ లో చేయాలని చూస్తున్నారట కాజల్‌ అండ్‌ తమన్నా. వేరే బాషలో వచ్చిన మంచి సినిమాలనైనా తీసుకుని తెలుగులో రీమేక్‌ చేసుకుంటే.. కెరియర్‌ ఆఖర్లో నాలుగు రాళ్ళు ఎక్కువా వెనకేసుకోవచ్చు.. అదే విధంగా.. అవి హిట్టయితే కెరియర్‌ కూసినన్ని సంవత్సరాలు పొడిగించుకోనూ వచ్చు.

ఇదే విధంగా ఆలోచించి.. అప్పట్లో శ్రీయ ''పవిత్ర''.. ఇప్పుడు త్రిష ''నాయకి'' ''మోహిని'' వంటి సినిమాలు చేసింది.. చేస్తోంది. కాని ఎవరికి ఏ సినిమా ఎలాంటి ఫ్యూచర్ ను ప్రామిస్‌ చేస్తుంది అంటే మాత్రం చెప్పలేం.