Begin typing your search above and press return to search.

షాకింగ్ః కాజల్ రౌడీ వేశాలు!

By:  Tupaki Desk   |   26 March 2021 7:23 AM GMT
షాకింగ్ః కాజల్ రౌడీ వేశాలు!
X
పెళ్ల‌య్యింది కాబ‌ట్టి అవ‌కాశాలు త‌గ్గాయా..? అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి కాబ‌ట్టి నిర్ణ‌యాలు మారుతున్నాయా? అన్న‌ది తెలియ‌దు గానీ.. టాలీవుడ్ చంద‌మామ, ఇప్పుడు ‘రౌడీ వేశాలు’ కూడా వేసేందు‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈమధ్యనే మంచు విష్ణుతో కలిసి మోసగాళ్లు సినిమాలో నటించిన కాజల్.. అందులో విష్ణుకు అక్కగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కాజ‌ల్ టాలీవుడ్ హీరోకు అక్క‌గా న‌టించింద‌న్న ఆశ్చ‌ర్యంలోంచి తేరుకోకముందే.. మ‌రో బాంబు విసిరేసిందీ బ్యూటీ. అవ‌కాశం వ‌స్తే విల‌న్ పాత్ర‌ల్లోనైనా న‌టించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది కాజ‌ల్‌! ప్ర‌స్తుతానికైతే కోలీవుడ్ కే ఈ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. అయితే.. ఈ నిర్ణ‌యాలు వింటున్న ప్రేక్ష‌కులు క‌ళ్లు పెద్ద‌వి చేస్తున్నారు.

టాలీవుడ్‌, కోలీవుడ్ లో క‌లిపి ప్ర‌స్తుతానికి కాజ‌ల్ చేతినిండా సినిమాలున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డానికి కార‌ణ‌మేంట‌ని బుర్ర‌గోక్కుంటున్నారు చాలా మంది. అయితే.. ఇందులోని లా పాయింట్ ను బ‌య‌టికి తీస్తున్నారు కొంద‌రు. ప్ర‌స్తుతం కాజ‌ల్ చేతిలో సినిమాలు ఉన్న‌మాట వాస్త‌వ‌మేగానీ.. అవ‌న్నీ పెళ్లికి ముందు ఒప్పందం చేసుకున్న‌వి మాత్ర‌మేన‌ని గుర్తుచేస్తున్నారు.

పెళ్లి త‌ర్వాత కొత్త ప్రాజెక్టుల‌పై పెద్ద‌గా సంతం చేయ‌లేద‌ని అంటున్నారు. సో.. ఆవిధంగా చూసుకున్న‌ప్పుడు అవ‌కాశాలు త‌గ్గుతున్నాయ‌ని అంటున్నారు. ఈ విష‌యం గుర్తించిన కాజ‌ల్‌.. దీపం కాన్సెప్టును అనుస‌రిస్తూ ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రి, ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందీ? కాజల్ నిర్ణయాలు ఇంకెలా ఉండబోతున్నాయి? అన్న‌ది రాబోయే రోజుల్లో చూడాలి.