Begin typing your search above and press return to search.

బెల్లంకొండ సరసన కాజల్ అగర్వాల్?

By:  Tupaki Desk   |   4 Feb 2018 7:12 AM GMT
బెల్లంకొండ సరసన కాజల్ అగర్వాల్?
X
టాలీవుడ్ లో మోస్ట్ లక్కీ యూత్ హీరో ఎవరయ్యా అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనే చెప్పాలి. చేసింది మూడు సినిమాలే అయినా భారీ బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు, క్రేజీగా అనిపించే కాంబినేషన్లు వెరసి హిట్టు ఫ్లాపు అని సంబంధం లేకుండా ఛాన్సులు కొట్టేస్తున్నాడు శ్రీనివాస్. ప్రస్తుతం డిక్టేటర్ ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సాక్ష్యం సినిమాలో హీరోగా చేస్తున్న బెల్లం హీరో ఇందులో కూడా డిజే బికినీ బ్యూటీ పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్నాడు. షూటింగ్ లో ఆలస్యం వల్ల సమ్మర్ కు షిఫ్ట్ అయ్యింది కాని లేదంటే ఈ పాటికి విడుదల కావలసిన మూవీ ఇది. దీని తర్వాత బెల్లంకొండ హీరో మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టేసాడు. రాజు గారి గది 2తో డీసెంట్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న యాంకర్ ఓంకార్ తో క్రీడల నేపధ్యంలో ఓ ప్రాజెక్ట్ దాదాపు ఓకే అయినట్టే. మరికొద్ది రోజుల్లో దీని గురించి ప్రకటన రావొచ్చు.

దీనితో పాటు డెబ్యు డైరెక్టర్ నానితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు సాయి శ్రీనివాస్. ఇందులో హీరొయిన్ గా కాజల్ అగర్వాల్ నటించే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. కథ విన్న కాజల్ ఇంప్రెస్ అయ్యిందని, ప్రాధాన్యం ఉన్న హీరొయిన్ రోల్ కావడంతో ఓకే చెప్పడం ఖాయమే అని వినిపిస్తోంది. మొన్న సంవత్సరం సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం డిజాస్టర్స్ తర్వాత కాజల్ స్పీడ్ బాగా తగ్గింది. లాస్ట్ ఇయర్ ఖైది నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సూపర్ హిట్ అయినా కూడా అగ్ర హీరోల ప్రాజెక్ట్స్ రావడం లేదు. అందుకే టైం వేస్ట్ చేయకుండా వచ్చినవాటిలో బెస్ట్ ని సెలక్ట్ చేసుకుంటోంది.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ఎంఎల్ఎ చేస్తున్న కాజల్ తమిళ్ క్వీన్ రీమేక్ లో టైటిల్ రోల్ పోషిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కాజల్ చేయటం పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు. మొదటి సినిమానే సమంతాతో చేసిన ఈ కుర్ర హీరో తరువాత చేసిన వాటిలో తమన్నా - రకుల్ ప్రీత్ సింగ్ - క్యాథరిన్ త్రెస్సాలతో ఆడి పాడాడు. వెనుక కొండంత అండగా నాన్న బెల్లంకొండ సురేష్ ఉన్నారు కాబట్టే శ్రీనివాస్ దూకుడు సాగుతోంది అనే టాక్ ఉన్న నేపధ్యంలో ఒక గట్టి హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే చాలా ఉంది.