Begin typing your search above and press return to search.

ఆ చిరాకు మొహం ఏంటి కాజల్‌?

By:  Tupaki Desk   |   17 Dec 2015 5:30 PM GMT
ఆ చిరాకు మొహం ఏంటి కాజల్‌?
X
బాలీవుడ్‌ లో మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది కాజల్‌. ఈ విషయం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే ఈ సినిమా ట్రైలర్‌ ఈ శుక్రవారం నుండి ధియేటర్లలో రానుంది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఫస్టు లుక్‌ పోస్టర్‌ ఒకటి వచ్చింది. చూడగానే తెలుగు అభిమానులకు ఫిలమెంట్లు మాడిపోయాయ్‌ అంతే. పదండి ఎందుకో చూద్దాం.

ఆ పోస్టర్‌ చూస్తున్నారుగా.. ఇప్పటివరకు కేవలం కమర్షియల్‌ సినిమాలు మాత్రమే చేసిన కాజల్‌ అగర్వాల్‌.. తొలిసారిగా ఏదో ఆర్టిస్టిక్‌ గా ప్రయత్నించిందని తెలుస్తోంది. కాకపోతే అమ్మడి మొహం మాత్రం బాగా చిరాకుగా ఉండటంతో.. ఇదే ప్రేమకథండీ బాబూ అంటున్నారు ఫ్యాన్స్. ''దో లఫ్జోం కి కహానీ'' అంటే.. రెండు పదాల ప్రేమ కథ.. మరి టైటిల్‌ ను ఇంత క్రియేటివ్‌ గా పెట్టారు కాబట్టి సినిమాలో కంటెంట్‌ ఏదో కాస్త గాట్టిగానే ఉండుంటుంది అని అందరి నమ్మకం.

ఒక ప్రక్కన ప్రేమ ఎప్పుడు బాధించదు.. ప్రేమ ఎప్పుడూ గాయాన్ని మాన్పిస్తుంది అని క్యాప్షన్‌ పెట్టారు కాబట్టి.. కాజల్‌ గాయాలను రణదీప్‌ హుడా మాన్పించడమే టాపిక్‌ ఏమో!! ఏదేమైనా కాని.. కాజల్‌ అగర్వాల్‌ లుక్‌ మాత్రం డిజప్పాయింట్‌ చేసిందంతే. చూద్దాం ఈ సినిమాతో ఏం చేస్తుందో మరి.