Begin typing your search above and press return to search.

ఖైదీ.. ఐటెం సాంగ్.. నెం.1 చేసేశాయ్

By:  Tupaki Desk   |   30 Jan 2017 6:07 AM GMT
ఖైదీ.. ఐటెం సాంగ్.. నెం.1 చేసేశాయ్
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు అఫీషియల్ గా నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించేసింది. అదేంటీ.. కాజల్ ఎప్పటి నుంచో టాప్ హీరోయిన్ కదా.. ఇప్పుడు నెంబర్ 1 ఏంటీ అనుకోవచ్చు. కానీ హైద్రాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆఫ్ ది ఇయర్ 2016 కోసం ఓటింగ్ పెడితే.. ఇందులో కాజల్ అగర్వాల్ ను టాప్ ఛైర్ లో కూర్చోబెట్టారు ఆడియన్స్.

గతేడాది ఈ భామ 4వ ప్లేస్ లో ఉండగా.. ఈ ఏడాది ఏకంగా మొదటి స్థానానికి వచ్చేసింది. కాజల్ ఎప్పుడూ క్రేజీ హీరోయినే కానీ.. ఇంతగా టాప్ ప్లేస్ ఆక్రమించడానికి కారణం.. గతేడాది అమ్మడి గురించి ఎక్కువగా ఆడియన్స్ వెతుకులాడ్డమే. గతేడాది సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం అంటూ టాలీవడ్ టాప్ స్టార్స్ తో నటించగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ మూవీలో చేసిన పక్కా లోకల్ ఐటెం సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

అప్పటికే చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150కి సైన్ చేయడం.. కాజల్ స్పీడ్ ని టాప్ గేర్ లోకి దూసుకెళ్లిపోయింది. ముఖ్యంగా పక్కా లోకల్ ఐటెం సాంగ్.. ఖైదీలో హీరోయిన్ ఛాన్స్.. ఈ రెండూ కాజల్ అగర్వాల్ క్రేజ్ ను అమాంతం పెంచేసి.. నంబర్ 1ని చేసేశాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/