Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైమ్ 'లైవ్ టెలికాస్ట్' తో భయపెడతానంటున్న కాజల్..!

By:  Tupaki Desk   |   23 Oct 2020 4:00 PM GMT
ఫస్ట్ టైమ్ లైవ్ టెలికాస్ట్ తో భయపెడతానంటున్న కాజల్..!
X
డిజిటల్ వరల్డ్ లో రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే హవా నడుస్తుందని భావిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ లలో నటించారు. స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఇప్పటికే వెబ్ సిరీస్ లలో నటిస్తున్నప్పటికీ.. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ స్టార్ట్ అవుతోంది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఓ తమిళ వెబ్ సిరీస్ లో నటించింది. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందించిన 'లైవ్ టెలికాస్ట్' అనే హార్రర్ వెబ్ సిరీస్ లో కాజల్ 'ఘోస్ట్' గా కనిపించనుంది. చందమామ కాజల్ తొలిసారిగా ఇలాంటి పాత్రలో కనిపిస్తోందని చెప్పవచ్చు.

తాజాగా కాజల్ అగర్వాల్ తన డెబ్యూ వెబ్ సిరీస్ 'లైవ్ టెలికాస్ట్' గురించి వెల్లడిస్తూ దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. ఈ పోస్టర్ లో కాజల్ ఓ ఘోస్ట్ గా కనిపిస్తోంది. వైభవ్ మరియు ఆనంది టీవీ లైవ్ టెలికాస్ట్ లో భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. 'లైవ్ టెలికాస్ట్' సిరీస్ 7 ఎపిసోడ్స్ గా ప్రసారం అవుతుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. మొత్తం మీద సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న కాజల్.. ఇప్పుడు వెబ్ వరల్డ్ లో కూడా తన హవా చూపించడానికి రెడీ అయింది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'.. మంచు విష్ణు 'మోసగాళ్లు' మూవీలలో నటిస్తోంది. అలానే తమిళంలో కమల్ హాసన్ - శంకర్ కాంబోలో వస్తున్న 'ఇండియన్ 2' సినిమాలోనూ నటించనుంది.