Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : హనీమూన్‌ లో సముద్రపు అందంను ఆస్వాదిస్తున్న చందమామ

By:  Tupaki Desk   |   10 Nov 2020 1:50 PM GMT
ఫొటోటాక్‌ : హనీమూన్‌ లో సముద్రపు అందంను ఆస్వాదిస్తున్న చందమామ
X
టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ గత నెల 30వ తారీకున గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత ఈ కొత్త దంపతులు మాల్దీవ్‌ లకు హనీమూన్‌ కు వెళ్లారు. అక్కడ నుండి కాజల్‌ రెగ్యులర్‌ గా ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంది. మాల్దీవ్‌ ల అందాలను ఆస్వాదిస్తూ ఈ సమయంను వారు ఎంజాయ్‌ చేస్తున్నారు. కాజల్‌ ఈ ఫొటోలో బ్లూ స్కై మరియు బ్లూ సీ అందాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. ఈ ఫొటోను కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు తీశాడు. అందమైన కాజల్‌ ను అద్బుతమైన లొకేషన్‌ లో మరింత అందంగా గౌతమ్‌ బంధించి తనలోని ఫొటోగ్రాఫర్‌ ను బయట పెట్టాడు.

ఈ లొకేషన్‌ లో కాజల్‌ తీసుకున్న రెండు ఫొటోలు ఇన్‌ స్టా గ్రామ్‌ లో షేర్‌ చేసింది. ఆ రెండు ఫొటోలు కూడా గౌతమ్‌ తీసినవే. ఫొటోలపై ఆయన పేరు వాటర్‌ మార్క్‌ కూడా ఉంది. కాజల్‌ మరియు గౌతమ్‌ లు మరో వారం రోజుల పాటు మాల్దీవ్‌ ల్లో ఉండబోతున్నారు. ఆ తర్వాత ముంబయికి రానున్నారు. ముంబయికి వచ్చిన వెంటనే ఆచార్య సినిమా షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉంది. కాని చిరంజీవి కరోనా కారణంగా కాజల్‌ దంపతులు మరి కొన్ని రోజులు ముంబయిలోనే తమ కొత్త ఇంట్లో గడపబోతున్నారు. ఆచార్య షూటింగ్‌ క్యాన్సిల్‌ అయ్యింది కనుక హనీమూన్‌ మరికొన్ని రోజులు పొడగించే అవకాశం కూడా లేకపోలేదంటూ సమాచారం అందుతోంది. కాజల్‌ నుండి మరెన్ని అద్బుతమైన ఫొటోలను చూడబోతున్నామో..!