Begin typing your search above and press return to search.

మ‌మ్మీ అయినా కానీ డోస్ పెంచేసిన చంద‌మామ‌

By:  Tupaki Desk   |   2 April 2023 3:19 PM IST
మ‌మ్మీ అయినా కానీ డోస్ పెంచేసిన చంద‌మామ‌
X
ఇటీవ‌లి కాలంలో రంగుల పరిశ్ర‌మ తీరు తెన్నులు అమాంతం మారిపోయాయి. ముఖ్యంగా భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో గ్లామ‌ర్ ఎలివేషన్ ప‌రంగా పెను పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్లామ‌ర్ ఎలివేష‌న్ లో ఏ ఇత‌ర హాలీవుడ్ స్ట‌ర్ కి త‌గ్గ‌ని రీతిలో చెల‌రేగిపోతూ నేటిత‌రం క‌థానాయిక‌లు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. న‌య‌న‌తార - కాజ‌ల్ - త్రిష లాంటి సీనియ‌ర్ల సీజ‌న్ వ‌ర‌కూ గ్లామ‌ర్ ఎలివేష‌న్ ట్రెండ్ వేరు. ఇప్ప‌టి ట్రెండ్ వేరు. నేటిత‌రం భామ‌లు దేనికైనా సై అనేస్తున్నారు. కాస్త హ‌ద్దు దాటి ఎక్స్ పోజ్ చేసేందుకు ఏమాత్రం అభ్యంత‌రం చెప్ప‌డం లేదు. గ్లామ‌ర్ ఎలివేష‌న్ పీక్స్ కి చేర్చారు.

అయితే నేటిత‌రం భామ‌ల‌తో పోటీప‌డి నిల‌దొక్కుకోవాలంటే ఇప్పుడున్న‌ సీనియ‌ర్ క‌థానాయిక‌లు న‌టీమ‌ణులు కూడా హ‌ద్దులు దాటాల్సి వ‌స్తోంది. న‌య‌న్- త్రిష‌- కాజ‌ల్ ఇప్పుడు రూట్ మార్చి కొత్త‌గా టూమ‌చ్ బోల్డ్ గా క‌నిపించాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఈ విష‌యాన్ని చంద‌మామ కాజ‌ల్ చాలా సులువుగా గ్ర‌హించింది. ట్రెండ్ ను అనుస‌రించి త‌న‌వంతు ప్ర‌య‌త్నం ఎలా ఉండ‌బోతోందో సూటిగా హింట్ కూడా ఇచ్చింది.

స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌లే ఒక బిడ్డ‌కు మామ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు సంసార బాధ్య‌త‌లు ఎన్ని ఉన్నా త‌న న‌ట‌వృత్తిని విడిచిపెట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు కాజ‌ల్. ఇప్ప‌టికీ త‌న‌లోని అందం చందం వ‌న్నె చిన్నెలు ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తూ వ‌రుస ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతోంది. తాజాగా నీతా ముఖేష్‌ అంబానీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లాంచింగ్ ప్రోగ్రామ్ లో కాజ‌ల్ మెరుపులు మెరిపించింది. కాజల్ మునుప‌టితో పోలిస్తే గ్లామర్ డోస్ అమాంతం పెంచింది. ఒక అంద‌మైన ట్రెడిష‌న‌ల్ లెహంగా లో క‌నిపించినా కానీ అవ‌స‌రం మేర గ్లామ‌ర్ ఎలివేష‌న్ తో ఆక‌ట్టుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో త‌న‌కు ఎదురేలేద‌ని నిరూపించేందుకు అగ్ర హీరో బాల‌కృష్ణ సినిమాతో ఘ‌నంగా రీఎంట్రీ ఇస్తోంది. త‌దుప‌రి టాలీవుడ్ లో భారీ చిత్రంలో అవ‌కాశం అందుకుని పెళ్లి త‌ర్వాతా త‌గ్గేదేలే అని ఫీల‌ర్స్ వ‌దులుతోంది. చిరంజీవి- నాగార్జున‌- వెంక‌టేష్‌- బాల‌కృష్ణ స‌హా అగ్ర హీరోల‌కు తానొక ఆప్షన్ అని హింట్ ఇస్తోంది. కాజ‌ల్ తాజా ప్ర‌య‌త్నాలు ఫ‌లించి ద్వితీయ ఫ‌ర్వంలో ఏ తీరుగా దూసుకెళుతుందో చూడాలి.