Begin typing your search above and press return to search.

పెళ్ల‌యినా కాజల్ లో ఏమాత్రం జోష్ త‌గ్గ‌లేదుగా

By:  Tupaki Desk   |   24 Jun 2021 7:30 AM GMT
పెళ్ల‌యినా కాజల్ లో ఏమాత్రం జోష్ త‌గ్గ‌లేదుగా
X
బిజినెస్ మేన్ ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడాక కాజ‌ల్ లైఫ్ సెల‌బ్రేష‌న్ గురించి తెలిసిందే. ఈ జంట ఇంత‌కుముందు మాల్దీవుల విహారం నుంచి వ‌రుస ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. సంసార స‌రిగ‌మ‌ల ఆస్వాధ‌న‌తో పాటు మ‌రోవైపు కెరీర్ ప‌రంగానూ ఎవ‌రికి వారు బిజీబిజీగా ఉన్నారు.

ఇక పెళ్లి త‌ర్వాతా వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది అందాల చంద‌మామ‌. ఆచార్య‌.. భార‌తీయుడు 4 .. హే సినామికా లాంటి క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. అ! త‌ర్వాత నాని నిర్మిస్తున్న మ‌రో చిత్రంలోనూ కాజ‌ల్ న‌టించ‌నుంది.

ఇక ఇటీవ‌లే కాజల్ అగర్వాల్ పుట్టినరోజు జరుపుకోగా.. ఆ స్పెష‌ల్ డే కుటుంబం- స్నేహితులు - అభిమానులు సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు తెలిపారు. భర్త గౌతమ్ కిచ్లు త‌న కోసం ఒక‌ రొమాంటిక్ నోట్ రాశారు. ప్రేమ అంటే బహుశా అలా పాప్ కార్న్ ను పంచుకోవడం గురించి.. ఎక్కువ స‌మ‌యం మీతో కేటాయించ‌డం గురించి..సుదీర్ఘ ప్రయాణాల్లో దిండుగా ఉండటం గురించి... లేదా అదే ప్రదర్శనను టెలీలో చూడటానికి అంగీకార‌మా... జంట‌గా వేడి కోకో ను పీల్చాల‌నుకున్నప్పుడు.. ఐస్ క్రీం గురించి ఉత్సాహ‌ప‌డిన‌ప్పుడు.. సూర్యోదయాన్ని చూడటానికి నిదుర లేప‌డం గురించి .. అయినా ఖాత‌రు చేయ‌క‌ మధ్యాహ్నం వరకు నిద్రపోవడం.. ఇదంతా ప్రేమ అని పోయెటిక్ గా రాశారు.

భ‌ర్త కిచ్లుతో కాజ‌ల్ హ్యాపీ లైఫ్ ఎంద‌రికో స్ఫూర్తి నింపుతోంది. మ‌రోవైపు కాజ‌ల్ వ‌రుస ఫోటోషూట్ల‌తో ఇత‌ర నాయిక‌ల‌కు గ‌ట్టి పోటీనిస్తోంది. తాజాగా కాజ‌ల్ నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే హాట్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. లేటెస్ట్ ఫోటోషూట్ లో ఆ ప‌ర్పుల్ ఫ్రాకుపై డెనిమ్ జీన్స్ కోట్ ని ధ‌రించి కాజ‌ల్ ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది.