Begin typing your search above and press return to search.

తాజ్ లో చంద‌మామ కాజ‌ల్ పెళ్లి వైభ‌వం!

By:  Tupaki Desk   |   31 Oct 2020 10:45 AM IST
తాజ్ లో చంద‌మామ కాజ‌ల్ పెళ్లి వైభ‌వం!
X
కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న బాయ్ ఫ్రెండ్.. ఇటీరియ‌ర్ బిజినెస్‌మెన్ గౌత‌మ్ కిచ్లూని ఈ శుక్ర‌వారం వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిన‌దే. ముంబైలో అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన‌గా కాజ‌ల్ వివాహ వేడుక జ‌రిగింది. మార్వాడీ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో ఈ వివాహ వేడుక‌ను నిర్వ‌హించారు. ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ హోట‌ల్ లో కాజ‌ల్ వివాహం జ‌రిగింది.

కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌వ వ‌ధువుగా మెరిసి పోయింది. రెడ్ క‌ల‌ర్ లెహెంగాలో పెళ్లి కూతురిగా కాంతుళీనింది. వ‌రుడు గౌత‌మ్ కిచ్లూ వైట్ క‌ల‌ర్‌ షేర్వానీ.. త‌ల‌పాగాతో క‌నిపించాడు. ఈ పెళ్లి కోసం తాజ్ ‌మ‌హ‌ల్ హోట‌ల్ ‌ని అందంగా ముస్తాబు చేశారు. అందంగా అలంకరించబడిన హోటల్ బాల్‌రూమ్ ఫొటోలు ఆక‌ట్టుకుంటున్నాయి. సాంఘిక దూర నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ వివాహానికి త‌క్కువ మంది బంధువుల్ని ఆహ్వానించారు. అందుకు త‌గ్గ‌ట్టే ఏర్పాట్లు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కాజ‌ల్ పెళ్లి సాదా సీదాగా జ‌రిగింది. ప్ర‌స్తుతం పెళ్లి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

ఈ నెల ప్రారంభంలో కాజ‌ల‌ తన పెళ్లిని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. `నేను య‌స్‌ అని చెప్పానని అక్టోబర్ 30, 2020 న ముంబైలో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోబోతున్నానని ఆ విష‌యాన్ని మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంద‌ని తెలిపింది. గ‌త కొంత కాలంగా ఆద‌రిస్తూ ప్రేమాభిమానాలు కురిపిస్తున్న మీ ఆశీర్వాదం మాకు కావాలి` అని కాజ‌ల్ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.