Begin typing your search above and press return to search.
చిరునవ్వుతో బౌన్సర్ వేసి హబ్బీ కంపెనీకి ప్రచారమా?
By: Tupaki Desk | 26 Dec 2020 1:00 PM ISTఓవైపు క్రిస్మస్ సంబరం .. మరోవైపు ఫర్నీచర్ కంపెనీ ప్రచారం.. కాజల్ కిచ్లు డ్యూయల్ గేమ్ బావుంది. చిరునవ్వుతో బౌన్సర్ వేసి హబ్బీ కంపెనీకి ప్రచారం అదరగొట్టేస్తోంది కాజల్.
అందుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. కాజల్ అగర్వాల్ - భర్త గౌతమ్ కిచ్లు తాజాగా ఓ ఫోటోని షేర్ చేసి మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేళ ఉల్లాసాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ పనిలో పనిగా సొంత బ్రాండ్ ప్రచారం చేస్తోంది ఈ కొత్త జంట.
గౌతమ్ లేటెస్టుగా ఒక ఫన్నీ క్షణాన్ని ఇలా ఫోటో రూపంలో పంచుకున్నారు. ఈ ఫోటోలో కాజల్ .. కిచ్లు ఒకరికొకరు చేతిలో చెయ్యేసి ఎంతో ఆప్యాయతను ప్రేమానురాగాన్ని పంచుకుంటున్నారు. గౌతమ్ ఏదో జోక్ చేస్తుంటే కాజల్ ఇలా చిరునవ్వులు కురిపించేస్తోంది. ముదురు నీలం రంగు టీ-షర్టుల్లో వారిద్దరూ కవలల్లా కనిపిస్తున్నారు. కాజల్ షేర్ చేయగా ఈ పోస్ట్ కు వందలాది లైక్ లు వచ్చాయి. అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు. కాజల్ తన అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది.
కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30 న ముంబైలోని తాజ్ కొలాబాలో వివాహం చేసుకున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పరిమిత సంఖ్యలో అతిథులతో ఒక ప్రైవేట్ వేడుక గా ఇది సాగింది. ఇటీవల ఈ జంట తమ కొత్త వ్యాపార సంస్థను `కిచ్ డ్` పేరుతో ప్రారంభించారు. ప్రస్తుతానికి హస్తకళలతో డిజైన్ చేసిన కుషన్లను పరిమిత కాలానికి విక్రయిస్తున్నారు. ముంబైలో తమ కొత్త ఇంటిని సిద్ధం చేసుకుని ఇలా లైఫ్ ని సరికొత్తగా డిజైన్ చేసుకుంది ఈ జంట.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం వెనక ఆసక్తికర కథను కాజల్ ఇంతకుముందు వెల్లడించాడు. కిచ్ డ్ అనేది మా ఇంటి డెకార్ లేబుల్. కిచ్డ్ పుట్టినది డిజైన్ పై మక్కువతో.. మా మొదటి ఇంటిలో ప్రవేశించిన వేళ వచ్చిన ఆలోచన ఇది అని వెల్లడించారు.