Begin typing your search above and press return to search.

సెల‌బ్రేటింగ్ లైఫ్.. కాజ‌ల్ ఫుల్లీ కిచ్డ్

By:  Tupaki Desk   |   4 Dec 2020 2:11 PM IST
సెల‌బ్రేటింగ్ లైఫ్.. కాజ‌ల్ ఫుల్లీ కిచ్డ్
X
ఫ్యామిలీ ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లుని ప్రేమించి పెళ్లాడేసిన కాజ‌ల్ ఆ త‌ర్వాత హ‌నీమూన్ ని మాల్దీవుల్లో సెల‌బ్రేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. బ్లూ వాట‌ర్స్ లో వాట‌ర్ స్పోర్ట్స్ తో పాటు అండ‌ర్ వాట‌ర్ హ‌నీమూన్ అన్న‌ది కాజ‌ల్ - కిచ్లు జంట‌కే చెల్లింది.

కాజ‌ల్ కిచ్లు సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన వీడియోలు.. ఫోటోల‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అయితే ఈ సెల‌బ్రేష‌న్స్ అప్ప‌టితో ఆగిపోలేదు. ఓవైపు షూటింగుల‌తో బిజీ అయ్యేందుకు కాజ‌ల్ సిద్ధ‌మైనా వీలున్న ప్ర‌తిసారీ ఏదో ఒక సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోని లేదా వీడియోల్ని షేర్ చేస్తున్నారు. తాజాగా సెల‌బ్రేటింగ్ లైఫ్ అంటూ ఓ వీడియోని షేర్ చేయ‌గా అది అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.

ఖ‌రీదైన మండువా ఇల్లు ఆ లోగిలిలో త‌టాకం అందులో కాజల్ టాప్ టు బాట‌మ్ పింక్ లో బోలెడంత సంద‌డి చేసింది. కిచ్డ్ పేరుతో ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. కాజ‌ల్ ప్ర‌స్తుతం ఆచార్య చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనాల్సి ఉంది. అలాగే భార‌తీయుడు 2 పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉంటుంది. మంచు విష్ణుతో మోస‌గాళ్లు చిత్రీక‌ర‌ణ‌ను ముగించాల్సి ఉంటుంది. ఇత‌ర ప్రాజెక్టుల‌తోనూ కాజ‌ల్ బిజీగా ఉంది.