Begin typing your search above and press return to search.

ఆచార్య వాయిదాతో మరికొన్ని రోజులు హనీమూన్‌ లోనే కాజల్‌ కిచ్లు

By:  Tupaki Desk   |   12 Nov 2020 12:00 PM IST
ఆచార్య వాయిదాతో మరికొన్ని రోజులు హనీమూన్‌ లోనే కాజల్‌ కిచ్లు
X
చిరంజీవి.. కొరటాల కాంబో మూవీ 'ఆచార్య' ఈనెల 9వ తారీకు నుండి షూటింగ్‌ ప్రారంభం అవ్వాల్సి ఉండగా చిరంజీవి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో వాయిదా పడ్డ విషయం తెల్సిందే. చిరంజీవి కరోనా నుండి పూర్తిగా బయట పడ్డ తర్వాత ఆచార్య షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అంటే కనీసం నెల రోజుల సమయం అయినా పట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఈనెల 9వ తారీకున షూటింగ్‌ మొదలు పెడితే వారం పది రోజుల తర్వాత కాజల్‌ జాయిన్‌ అవ్వాల్సి ఉంది. అందుకే ఈ వారాంతం వరకు కాజల్‌ తన హనీమూన్ ను ముగించుకుని హైదరాబాద్‌ చేరాలని భావించింది.

ఆచార్య సినిమా షూటింగ్‌ వాయిదా పడ్డ కారణంగా మరో వారం లేదా పది రోజుల పాటు కాజల్‌ కిచ్లు దంపతులు మాల్దీవ్‌ ల్లోనే ఎంజాయ్‌ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే తమ హనీమూన్‌ ను పొడగించుకునేందుకు ప్లాన్‌ చేసుకున్నారట. హనీమూన్‌ సందర్బంగా వీరిద్దరు అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇద్దరు కూడా రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తున్నారు. కాజల్‌ షూటింగ్‌ లు ఏమీ లేని కారణంగా హాయిగా హనీమూన్‌ ను ఎంజాయ్‌ చేసేస్తుంది. ఈమె తమిళంలో చేస్తున్న ఇండియన్‌ 2 మద్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఆచార్య ఎప్పుడు ఆరంభం అయ్యేది తెలియడం లేదు.