Begin typing your search above and press return to search.

గుడ్డి అమ్మాయిగా కాజల్‌!!

By:  Tupaki Desk   |   20 Dec 2015 7:09 AM GMT
గుడ్డి అమ్మాయిగా కాజల్‌!!
X
2015-16 కాజ‌ల్‌ కి మ‌ర‌పు రాని సీజ‌న్ అన‌డంలో సందేహ‌మే లేదు. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న క‌థానాయిక‌గా వెలుగులు విర‌జిమ్మింది. కొత్త సంవ‌త్స‌రంలో సూప‌ర్‌ స్టార్ల స‌ర‌న న‌టిస్తూ కెరీర్‌ లో బిజీగా ఉంది. ప‌వ‌న్‌ - మ‌హేష్ స‌ర‌స‌న న‌టిస్తోందిప్పుడు. బ్ర‌హ్మోత్స‌వం - స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ ఆన్‌ సెట్స్ ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్ లో దో ల‌ఫ్జోంకి క‌హానీ అనే చిత్రంలో న‌టిస్తోంది. ర‌ణ‌దీప్ హుడా ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. దీప‌క్ తిజోరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ఇదో ఎమోష‌న‌ల్ ల‌వ్‌ స్టోరీ. ఇందులో కాజ‌ల్ ఓ బ్లైండ్ గాళ్ పాత్ర‌లో న‌టిస్తోంది. రెగ్యుల‌ర్ గ్లామ‌ర‌స్ రోల్‌ కి దూరంగా ఈ క్యారెక్ట‌ర్ బోలెడంత ఎమోష‌న్‌ తో కొన‌సాగుతుంది.

దో ల‌ఫ్జోంకి.. ఓ ఇంటెన్స్ ల‌వ్‌ స్టోరీ. ఓ గుడ్డి అమ్మాయికి, ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసే కార్మికుడికి మ‌ధ్య ప్రేమాయ‌ణం ఎలా సాగింది? అన్న‌దే సినిమా. ఇందులో ర‌ణ‌దీప్ ఓ బాక్స‌ర్‌ గానూ క‌నిపిస్తున్నాడు. రింగ్ ఫైట‌ర్‌ గా నైట్ లైఫ్‌ లో ఎంట‌ర‌య్యే అత‌డి జీవితంలో ఓ యాక్సిడెంట్ ఎలాంటి ఎమోష‌న్‌ ని తెచ్చింది అన్న‌ది తెర‌పైనే చూడాలి. ఇటీవ‌లే టీజ‌ర్ రిలీజైంది. ఇందులో కాజ‌ల్ త‌న కెరీర్‌ లోనే ఓ డిఫ‌రెంట్ రోల్ చేసింది అన‌డానికి ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. కాజ‌ల్ వోన్‌ గానే ఈ మూవీకి డ‌బ్బింగ్ చెప్పుకుంది. ర‌ణ‌దీప్‌ తో ఓ డీప్ లిప్ లాక్ కూడా వేయ‌డం సెన్సేష‌న్ అవుతోంది. సొంత ప‌రిశ్ర‌మ బాలీవుడ్‌ లో స్టార్ గా ఎద‌గాల‌న్న క‌ల‌ని ఈ సినిమా నెర‌వేరుస్తుందేమో చూడాలి.