Begin typing your search above and press return to search.

`ఆచార్య` సెట్లో కాజ‌ల్ కిచ్లు జంటకు పెళ్లంట‌!

By:  Tupaki Desk   |   15 Dec 2020 11:28 AM IST
`ఆచార్య` సెట్లో కాజ‌ల్ కిచ్లు జంటకు పెళ్లంట‌!
X
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న స్నేహితుడు బిజినెస్ మేన్ గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 30న ముంబై తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ లో వెడ్డింగ్ అనంత‌రం ఈ కొత్త జంట మాల్దీవుల్లో విహార యాత్ర‌కు వెళ్లారు. అండ‌ర్ వాట‌ర్ హ‌నీమూన్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోల్ని కాజ‌ల్ స్వ‌యంగా అభిమానుల‌కోసం ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేశారు.

హ‌నీమూన్ ముగిసిన అనంత‌రం ఇటీవ‌ల‌ కాజ‌ల్ తిరిగి `ఆచార్య` షూటింగ్ లో జాయిన‌య్యారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోని సెట్లో మెగాస్టార్ చిరంజీవి .. కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌హా కీల‌క న‌టీన‌టుల‌పై శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ సాగుతోంది.

నేడు(గురువారం) కాజ‌ల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లు ఆచార్య సెట్స్ కి విచ్చేసి చిత్ర‌బృందాన్ని స‌ర్ ప్రైజ్ చేశారు. కాజ‌ల్ - కిచ్లు జంట‌కు ఈ సంద‌ర్భంగా ఆచార్య చిత్ర‌బృందం శుభాకాంక్ష‌లు తెలిపింది. కొత్త జంట‌కు దండ‌లు మార్చి మ‌రోసారి ఆన్ లొకేష‌న్ సంద‌డి చేసారు. మెగాస్టార్ చిరంజీవి కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు. ఈ సెల‌బ్రేష‌న్ లో చిరు స‌హా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌.. సినిమాటోగ్రాఫ‌ర్ తిరు.. నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి.. హ‌వీష్ రెడ్డి.. త‌దిత‌రులు పాల్గొన్నారు.