Begin typing your search above and press return to search.

కాజల్ మళ్లీ ఆ డైరెక్టర్ తో !

By:  Tupaki Desk   |   11 Aug 2019 7:00 AM IST
కాజల్ మళ్లీ ఆ డైరెక్టర్ తో !
X
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో 'అ!' సినిమా చేసింది కాజల్. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కాజల్ దే ప్రధాన పాత్ర కావడంతో ఆ సినిమాకు సంబంధించి కాజల్ కి మంచి ప్రశంసలు దక్కాయి. అందుకే ఇప్పుడు మళ్లీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది కాజల్. లేటెస్ట్ గా 'కల్కి'తో రాజశేఖర్ ని డైరెక్టర్ చేసిన ప్రశాంత్ ప్రస్తుతం కాజల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. పూర్తి స్క్రిప్ట్ రెడీ అవ్వగానే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

ఇక 'సీత'తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన కాజల్ ఇప్పుడు 'రణరంగం'పైనే ఆశలు పెట్టుకుంది. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ డాక్టర్ పాత్రలో కనిపించనుంది. రెండో భాగంలో కొద్ది సేపు కాజల్ క్యారెక్టర్ ఉంటుందట. అయితే అమ్మడు క్యారెక్టర్ తోనే సెకండ్ హాఫ్ లీడ్ ఉంటుందట.ఈ సినిమా సక్సెస్ తో మళ్లీ తెలుగులో వరుస సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తుంది చేపకళ్ల సుందరి.

ప్రస్తుతం తమిళ్ లో కాజల్ నటించిన 'క్వీన్' రీమేక్ 'పారిస్ పారిస్' సినిమా సెన్సార్ చిక్కుల్లో ఉంది. ఎక్కువగా బోల్డ్ సీన్స్ ఉన్నందున సినిమాను సెన్సార్ ఇబ్బందులు చుట్టుముట్టాయి. నిర్మాతలు సెన్సార్ సర్టిఫికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరి ఆ సినిమా సెన్సార్ ఎప్పుడవుతుందో... తమిళ్ ప్రేక్షకులను మెప్పిస్తుందా..? చూడాలి.