Begin typing your search above and press return to search.

ఆమె దగ్గర నేనింకా చిన్న పిల్లనే

By:  Tupaki Desk   |   31 Jan 2016 3:00 PM IST
ఆమె దగ్గర నేనింకా చిన్న పిల్లనే
X
ఎంత గొప్ప వ్యక్తి అయినా, వాళ్లు వయసులో పెద్దవారైనా, స్థాయిలో ఉన్నత స్థితికి చేరుకున్నా.. వారు తల్లి దగ్గర ఇంకా చిన్న పిల్లలే. అమ్మ దగ్గరే పిల్లలు చిన్నవారు.. మరి అమ్మమ్మ దగ్గర ఇంకెలా ఉండాలి. ఆ పండు ముసలివారికి తమ మనవలు, మనవరాళ్లు ఎప్పటికీ పసివారిగానే కనిపిస్తారు. వీరు కూడా ఆ వయసు మీరిన వారిదగ్గర మరీ చిన్న పిల్లలై పోతారు.

టాలీవుడ్ చందమామ కాజల్ ను చూసేందుకు చాలామంది అభిమానులు వస్తూంటారు. షూటింగ్ స్పాట్లలో కూడా ఇలాంటి విజిటర్స్ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తాజాగా కాజల్ ను షూటింగ్ లో చూడ్డానికి ఓ విశిష్ట అతిథి విచ్చేసింది. ఆమె ఎవరో కాదు.. కాజల్ అమ్మమ్మ. కోలీవుడ్ హీరో జీవాతో కలిసి కాజల్ 'కవలై వేండమ్'(బాధ పడద్దు) అనే కామెడీ మూవీలో చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ నీలగిరి కొండల్లోని కూనూర్ లో జరుగుతుండగా.. కాజల్ అమ్మమ్మ సెట్స్ కు వచ్చారు.

తనను చూసేందుకు వచ్చిన అమ్మమ్మని చూసి తెగ సంబరపడిపోయింది చందమామ. అమె ఒళ్లో కూర్చుని ఫోటోలు తీసుకుంది. వాటిని సోషల్ సైట్లలో పోస్ట్ చేసి.. ఈమె ముందు నేనింకా చిన్న పిల్లనే అంటోంది కాజల్. కాజల్ ని ఇంత చిన్నపిల్ల మాదిరిగా చూసిన అభిమానులు కూడా.. ఆమె సంతోషాన్ని పంచుకున్నారు.