Begin typing your search above and press return to search.

సూర్పణకగా కాజల్..

By:  Tupaki Desk   |   5 July 2018 11:23 AM IST
సూర్పణకగా కాజల్..
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో తన లెవెల్ ను ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. సీనియర్ హీరోలతో అలాగే కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ మారికొన్నేళ్ళు తన కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటోంది. కొన్ని కథలకు ఇప్పుడు కాజల్ లాంటి ముద్దుగుమ్మే కావాలని దర్శకులు ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే 50కి పైగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేసింది.

ఇక నెక్స్ట్ పూర్తి పౌరాణిక చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కాజల్ నటనకు తగ్గట్టు తనని తాను మార్చుకుంటుంది అనే టాక్ ఉంది. ఇక త్వరలోనే అన్ని కుదిరితే రావణుడి సోదరి సూర్పణక పాత్రలో కాజల్ నటించడానికి రెడీ అవుతుందట. ఈ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని దర్శకుడు భార్గవ్ భారీ బడ్జెట్ తో ఫుల్ సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. వాల్మీకి రాసిన రామాయణంలో సూర్పణక క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో చాలా మందికి తెలిసే ఉంటుంది. రామ రావణ యుద్ధం మొదలవ్వడానికి మొదటి కారకురాలు.

రాముడిపై మనసు పారేసుకొని దక్కించుకోవాలని అనుకుంది. ఆ తరువాత లక్ష్మణుడు ఆమె ముక్కు కోసేయ్యడం..రావణుడు కోపంతో సీతను అపహరించడం వంటి అంశాల గురించి అందరికి తెలిసిందే. అయితే సూర్పణక పాత్రను తెరపై చూపిస్తే అందంగా ఉంటుందని దర్శకుడు కథను సెట్ చేసుకున్నాడట. ఇప్పటికే పాత్రకు సంబంధించిన డిజైన్ ను సెట్ చేసుకొని కాజల్ ని ఊహించుకొని స్కెచెస్ వేశారట. కాజల్ కి అది బాగా నచ్చిందని తెలుస్తోంది. అయితే ఇంకా కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం.