Begin typing your search above and press return to search.

కాజల్‌ కు ఇది అద్బుతమైన అవకాశం

By:  Tupaki Desk   |   6 Nov 2018 5:28 AM GMT
కాజల్‌ కు ఇది అద్బుతమైన అవకాశం
X
‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో పరిచయం అయ్యి ‘చందమామ’, ‘మగధీర’ చిత్రాలతో స్టార్‌ డం ను దక్కించుకుని అప్పటి నుండి కూడా టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతూనే ఉన్న ముద్దుగుమ్మ కాజల్‌. గత సంవత్సర కాలంగా ఈమెకు కాస్త అవకాశాలు తగ్గినా కూడా స్టార్‌ డం మాత్రం ఏమాత్రం తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్‌ లో దాదాపు స్టార్‌ హీరోలందరితో నటించేసిన ఈ అమ్మడు తాజాగా యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కు జోడీగా నటించే అవకాశంను దక్కించుకున్నట్లుగా కోలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ప్రస్తుతం శంకర్‌, కమల్‌ లు సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో శంకర్‌ ప్రతిష్టాత్మకంగా కమల్‌ తో ఈ సీక్వెల్‌ ను తెరకెక్కించేందుకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా మొదలు పెట్టాడు. ప్రస్తుతం ‘2.ఓ’ చిత్రం విడుదల కారణంగా భారతీయుడు 2 చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను ఆపేయడం జరిగింది. ఈ నెల చివర్లో సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన శంకర్‌ డిసెంబర్‌ లో భారతీయుడు 2 చిత్రంపై పూర్తి ఫోకస్‌ పెట్టబోతున్నాడట. ఈ చిత్రంలో కాజల్‌ ను హీరోయిన్‌ గా శంకర్‌ అనుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.

కమల్‌ కు జోడీగా కాజల్‌ అయితేనే బాగా సూట్‌ అవుతుందని, తమిళంతో పాటు తెలుగు మరియు హిందీలో కూడా కాజల్‌ కు గుర్తింపు ఉన్న కారణంగా ‘భారతీయుడు 2’ చిత్రం ప్రమోషన్‌ విషయంలో బాగా హెల్ప్‌ అవుతుందని కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారట. కెరీర్‌ లో కాజల్‌ ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించింది. కాని ఇదో గొప్ప అవకాశం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాలీవుడ్‌ స్థాయిలో ఉంటాయి. అంతటి గొప్ప చిత్రాల్లో నటించే అవకాశం రావడం ఏ హీరోయిన్‌ కు అయినా అద్బుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. కాజల్‌ కు ‘భారతీయుడు 2’ చిత్రంలో నిజంగానే ఆఫర్‌ వస్తే ఆమె కెరీర్‌ మరో అయిదు సంవత్సరాలు సాఫీగా సాగిపోవడం ఖాయం అని, ఆమె మళ్లీ బిజీ అవ్వనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.