Begin typing your search above and press return to search.

12 చేంజ్ మేకర్స్ లిస్టులో ఆ హీరోయిన్లు

By:  Tupaki Desk   |   5 Nov 2018 1:14 PM IST
12 చేంజ్ మేకర్స్ లిస్టులో ఆ హీరోయిన్లు
X
పాపులర్ మ్యాగజైన్ ఇండియా టుడే వారు రీసెంట్ గా '12 మోస్ట్ పవర్ ఫుల్ చేంజ్ మేకర్స్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ వరల్డ్' అంటూ 12 మంది మహిళలతో ఒక లిస్టు ప్రకటించింది. ఇందులో టాలీవుడ్ హీరోయిన్స్ ముగ్గురికి స్థానం దొరకడం విశేషం. ఆ ముగ్గురూ ఎవరో కాదు.. కాజల్ అగర్వాల్ - రకుల్ ప్రీత్ సింగ్ - తాప్సీ.

వీరితో పాటు గా రాధిక ఆప్టే.. యామి గౌతమ్ లాంటి వారు కూడా ఈ లిస్టు లో ఉన్నారు కానీ వారు ఇప్పుడు టాలీవుడ్ లో యాక్టివ్ గా లేరు..బాలీవుడ్ లో యాక్టివ్ గా ఉన్నారు. ఇక బాలీవుడ్ నుండి ట్వింకిల్ ఖన్నా కూడా ఈ లిస్టు లో చోటు సాధించింది. ఈ లిస్టు లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు స్థానం దక్కకపోవడం విశేషం. ఈ లిస్ట్ లో క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ..బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. రచయిత్రి మిమీ మొండాల్.. ఫ్యాషన్ డిజైనర్ మసబా గుప్తా.. నటి రసికా దుగ్గల్ స్థానం సంపాదించారు.

ఇంతకీ ఏ బేసిస్ మీద వీరని ఈ లిస్టు లో సెలక్ట్ చేశారంటే.. "తాము అనుకున్న దాన్ని సాధించడంలో వారు చూపే పట్టుదల.. ఎవరైనా 'నో' చెప్తే పట్టువిడవకుండా దాన్ని సుసాధ్యం చేయడం" లాంటి లక్షణాలే. ఇండియాటుడే వారు చెప్పడం కాదు గానీ ఆలోచిస్తే ఈ హీరోయిన్ల యాటిట్యూడ్ అలానే ఉందని అనిపిస్తోంది కదా?