Begin typing your search above and press return to search.

లూజ్ డెనిమ్ లో బేబీ బంప్ దాచేసిన కాజ‌ల్

By:  Tupaki Desk   |   5 Feb 2022 5:31 AM GMT
లూజ్ డెనిమ్ లో బేబీ బంప్ దాచేసిన కాజ‌ల్
X
గ‌ర్భిణి ప్ర‌యాణాలు నిషేధం అంటూ భామ్మ‌లు కండీష‌న్లు పెడ‌తారు. అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు నిషేధం. అంతేనా.. బ‌రువులు ఎత్త‌కూడ‌దు.. మెట్లు ఎక్క కూడ‌దు! బస్సులు రైళ్లు విమానాల్లో ప్ర‌యాణాలు కూడ‌దంటూ చాలా కండీష‌న్లు పెడ‌తారు.

కానీ ఈ రోజుల్లో పాటించేది ఎవ‌రు? అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ తాను త్వ‌ర‌లోనే త‌ల్లిని కాబోతున్నాన‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆ త‌ర్వాత చాలా ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ఇన్ స్టాలో ట‌చ్ లోనే ఉన్నారు. కాబోయే తల్లి కాజల్ గర్భవతి అయినప్ప‌టి నుంచి ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఆమె సోషల్ మీడియాలో శుభవార్త ప్రకటించినప్పటి నుండి తన బేబీ బంప్ ప్ర‌ద‌ర్శ‌న ఆగ‌లేదు. ప్ర‌తిసారీ మెటర్నిటీ ఫ్యాషన్ ను ప్రదర్శించేందుకు ఆరాట‌ప‌డ‌డం చూస్తున్నాం.

అంతేకాదు.. ఇప్పుడు త‌న విదేశీ విహారయాత్రల గురించి బ‌య‌ట‌ప‌డింది. కాజ‌ల్ ఇంత‌కుముందు దుబాయ్ కి విహార‌యాత్ర‌కు వెళ్లి ముంబైకి తిరిగి వ‌చ్చేశారు. దుబాయ్ నుండి వచ్చిన అనంత‌రం లేటెస్ట్ ఫోటోషూట్ ని రివీల్ చేశారు. ఇది చాలా ట్రెండీగా ఉంది. లూజ్ డెనిమ్ లో కాజ‌ల్ త‌న బేబి బంప్ ని దాచేస్తోంది. కానీ ప్ర‌తిదీ బ‌య‌ట‌ప‌డిపోతోంది. కాజల్ స్టైలిష్ డెనిమ్ షర్ట్ స్టైల్ డ్రెస్ లో తన బేబీ బంప్ ను దాచేస్తోందేమిటీ? అంటూ అభిమానులు విస్మ‌యం చెందుతున్నారు.

అయితే కాజ‌ల్ ఎంపిక చేసుకున్న డెనిమ్స్ ఎంతో అద్భుతంగా కుదిరింది. వైట్ స్నీకర్లతో ఎంతో స్టైలిష్ గా క‌నిపించింది కాజ‌ల్. ప్రసూతి స్కిన్ టోన్ రహస్యం ఏమిటీ? అంటే.. అనంత‌మైన‌ ప్రేమ.. నవ్వు అన్న‌ట్టు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల‌కు ``ఖాళీ మ‌హిళ‌ మానసిక స్థితి`` అని క్యాప్షన్ ఇచ్చారు కాజ‌ల్. త‌ను భ‌ర్త‌తో బస చేసిన హోటల్ ను ట్యాగ్ చేసింది. ప్ర‌స్తుతం కాజ‌ల్ డెనిమ్స్ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అన్న‌ట్టు విమానంలో దుబాయ్ కి.. అట్నుంచి ముంబైకి కాజ‌ల్ చ‌క్క‌ర్లు కొట్టింది. ఇది స‌రైనాదేనా కాదా అన్న‌ది త‌న‌ భామ్మ గారు నిర్ణ‌యించాలి.