Begin typing your search above and press return to search.
కాజల్ పెళ్లి వాయిదా వేసుకుందా?
By: Tupaki Desk | 15 March 2018 1:35 PM ISTహీరోయిన్లు ఓ పది సినిమాలు చేశారా పాతబడిపోయినట్టే. వారి ముఖాలు మళ్లీ మళ్లీ చూడలేక... కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతారు దర్శకనిర్మాతలు. కాజల్ పరిస్థితి కొన్నాళ్ల క్రితం ఇంతే. ఆమెను వద్దనుకుని కొత్తందాలను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె సుడి బాగా తిరగడంతో... మళ్లీ ఆమెనే కావాలనుకుంటున్నారు టాలీవుడ్ పెద్దలు. అందుకే కాజల్ మాత్రం ఊరుకుంటుందా? అందిన కాడికి దోచుకునేందుకు ప్లాన్ బాగానే వేసింది.
లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ పిల్ల. చందమామ సినిమాతో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. ఇక అప్పట్నించి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రభాస్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ రానా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అమ్మడిది. సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లకు పైగా అయిపోయింది. సీనియర్ హీరోయిన్ అయిపోవడంతో... ఆమె ముఖం ప్రేక్షకులకు బోరు కొడుతుందనుకున్నారేమో టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఆమెకు అవకాశాలు ఇవ్వడం తగ్గించారు. కొన్ని నెలల పాటూ ఆమె ఖాళీగానే ఉంది. సినిమాలు వచ్చే అవకాశాలు కూడా కనిపించలేదు. దీంతో ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది. అలాంటి సమయంలో చిరు పక్కన అవకాశం వచ్చింది కాజల్ కి.
ఖైదీ నెం 150లో చిరుతో నటించింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో మళ్లీ ఆశలు పెంచుకుంది కాజల్. తేజ సినిమా నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా హిట్ కొట్టి అమ్మడి అందం పవర్ తగ్గలేదని చెప్పకనే చెప్పింది. ఇక ఆ తరువాత అ సినిమాలో కూడా బాగానే ఆడింది. అందుకే కాజల్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడింది. పెళ్లి కూడా వాయిదా వేసుకుందని సమాచారం. తన రెమ్యునరేషన్ రెండు కోట్ల రూపాయలకు పెంచిందట. బేరసారాల్లేవని... అంత మొత్తం ఇవ్వగలిస్తే రమ్మని లేకుంటే పొమ్మని చెప్పేస్తోందట. ప్రస్తుతం ఆమె తన మొదటి హీరో కళ్యాణ్ రామ్ పక్కన ఎమ్మెల్యే సినిమాలో నటిస్తోంది.