Begin typing your search above and press return to search.

మూడు తరాల హీరోలతో కాజల్ రచ్చ

By:  Tupaki Desk   |   31 July 2016 4:00 AM IST
మూడు తరాల హీరోలతో కాజల్ రచ్చ
X
చాలామంది హీరోయిన్లకు లాంగివిటీ అనేది ఈ కాలంలో కష్టమే. అయితే అలా ఎక్కువ కాలం కొనసాగిన వారిలో.. శ్రీదేవి టైపులో అటు తండ్రి ఏఎన్నార్.. ఇటు కొడుకు నాగార్జునతో రొమాన్స్ చేసినట్లు.. ఎంతమంది చేయగలరు చెప్పండి? ఈ కాలంలో అసలు అలాంటి తండ్రీ కొడుకులే తక్కువ అంటే.. అలాంటి హీరోయిన్లు అస్సలు కనిపించరు. కాకపోతే ఏదో కొన్నేళ్ళకు మెరిసిన ఒక కొత్త తారలా ఇప్పుడు ఓ చందమామ సందడి చేస్తోంది.

31ఏళ్ల రామ్ చరణ్‌ తో నాలుగుసార్లు చిందులేసింది సెక్సిణి కాజల్. 33 ఏళ్ళ అల్లు అర్జున్ ప్రేమికురాలిగా మారింది. 44 ఏళ్ళ పవన్‌ కళ్యాణ్‌ కోసం లేడీ సర్దార్ గా తయారైంది. ఇప్పుడు కత్తిలా తయారై 60 ఏళ్ళ మెగాస్టార్ చిరంజీవి ప్రక్కన స్టెప్పేయనుంది. దాదాపు మూడు తరాల హీరోలతో అమ్మడు రచ్చ చేస్తోందని వేరే చెప్పాలా? అసలు ఈ నవతరం భామల్లో మెగా హీరోలతో ఆ ఫీటు చేసిన ఏకైక భామగా ఇప్పుడు అమ్మడు చరిత్ర సృష్టిస్తున్నట్లే.

నిజం చెప్పాలంటే చరణ్‌, బన్నీ, పవన్ లతో పనిచేసిన ఇంకో హీరోయిన్ అంటే తమన్నా ఒక్కతే ఉందిలే. ఆమెను కూడా చిరంజీవి తన తదుపరి సినిమా కోసం తీసుకుంటే మాత్రం.. అప్పుడు మూడు తరాల రచ్చ తమన్నా కూడా చేసినట్లే. చూద్దాం కాజల్ ను వరించిన అదృష్టం తమన్నాను కూడా వరిస్తుందో లేదో!!