Begin typing your search above and press return to search.

ఆ రెండు చోట్లా కాజల్ దొరికిపోయింది

By:  Tupaki Desk   |   2 Sep 2016 5:30 PM GMT
ఆ రెండు చోట్లా కాజల్ దొరికిపోయింది
X
'జనతా గ్యారేజ్‌' సినిమాలో కాజల్ అగర్వాల్ టాపులేపేసిందని వేరే చెప్పక్కర్లేదు. నిజానికి సినిమా ఫ్లోకు కాస్త అడ్డుపడినట్లు అనిపించినా కూడా.. ఈ సాంగులో అమ్మడు దారబోసిన అందాలు మాస్ ప్రేక్షకులను కట్టిపాడేస్తోంది. ఫస్టు టైము కెరియర్ లో ఇలా ఐటెం సాంగులో మెరిసిన.. ఓ రెండు విషయాల్లో మాత్రం దొరికిపోయిందనే చెప్పాలి.

నిజానికి తన కాంటెపరరీలు అయిన తమన్నా తరహాలో కాజల్ పెద్ద డ్యాన్సర్ కానే కాదు. అలాగే సింపుల్ స్టెప్పులను తప్పించి కాంప్లెక్సు మూవ్మెంట్లు ఇచ్చినా చేయలేదు. ఆ విషయం 'పక్కా లోకల్' పాట చూస్తుంటే మనకు పక్కాగా అర్ధమవుతుంది. ముఖ్యంగా అమ్మడు గ్రేస్ తో కూడిన స్టెప్పులను.. అలాగే ఫాస్టు ఫాస్టు స్టెప్పులనూ వేయాలని ప్రయత్నించింది కాని.. అబ్బే కష్టమేలే. నడుం తిప్పడానికి కూడా చాలా కష్టపడాల్సే వచ్చింది. ఇంతలా దొరికిపోయాక.. ఈ రేంజు మాసంటే మరోసారి వెయ్యదేమో మరి.

ఇంకో విషయం ఏంటంటే.. అమ్మడు ఈ మధ్య కాలంలో విపరీతంగా స్కిన్ షో చేసిందే లేదు. కాని ఈ పాటలో మాత్రం కాస్త కష్టపడి తన పరువాలను ఆరబోసింది. ఆ విషయం ఆరబోస్తున్నప్పుడు చూస్తే.. ఏదో ఇబ్బందిగానే ఎక్సపోజింగ్ చేస్తోందా అనే సంగతి కూడా ప్రేక్షకులకు తెలిసిపోతోంది. మోడ్రన్ డ్రస్సుల్లో ఆరేయడం ఓకె కాని. ఇలా కోక-రవిక కట్టేసి హాటందాలు చిందించాలంటే ఇబ్బందే.. అని చెప్పకనే చెప్పింది.