Begin typing your search above and press return to search.
ఇంత మాత్రానికేనా కాజల్?!
By: Tupaki Desk | 6 Sept 2015 11:23 PM ISTతెలుగులో కాజల్ కి వద్దంటే ఆఫర్ లు. హిట్లు, ఫ్లాపు లతో సంబంధం లేకుండా ఆమె కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతుంటారు. కానీ కాజలే ఒప్పుకోవాలా వద్దా అన్నట్టు వ్యవహరిస్తుంటుంది. ఇక్కడ ఓ సినిమా చేస్తుందో లేదో ఆ వెంటనే తమిళ్ కో, హిందీ కో వెళ్లిపోతుంటుంది. `బాద్‌షా` నుంచి ఆమెది ఇదే వరస. ఎందుకిలా అని అడిగితే... `మంచి కథలు, పాత్రలు ఎక్కడినుంచే వస్తే అక్కడికి వెళుతున్నా` అని చెబుతుంటుంది. కానీ టాలీవుడ్ జనాలు మాత్రం కాజల్ కథల్ని చూడటం లేదనీ, ఎవరు ఎక్కడ రెమ్యునరేషన్ ఎక్కువిస్తే అక్కడికి వెళుతోందని మాట్లాడుకొంటుంటారు. ఇప్పుడు ఆ మాటలే నిజమేనేమో అన్న సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఇటీవల విశాల్ తో కలిసి నటించిన `పాయుమ్ పులి`లో కాజల్ ది చెప్పుకోదగ్గ పాత్రేమీ కాదు. ఆ సినిమా తెలుగులోనూ `జయసూర్య` పేరుతో విడుదలైంది. ఆ సినిమా మొత్తంగా చూస్తే పాటల్లో తప్ప ఎక్కడా కాజల్ కి ప్రాధాన్యం కనిపించదు. ఇంతదానికే కొత్త పాత్రలు, కథలు అంటూ కహానీలు చెప్పాలా కాజల్ అంటున్నారు ఆమె అభిమానులు. తెలుగులో కాన్సంట్రేట్ చేస్తే ఇంతకంటే మంచి పాత్రలు దక్కుతాయి కదా అంటున్నారు. మరి కాజల్ అసలు ఇంటెన్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.
`బాద్‌షా`కి ముందు వరకు కాజల్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసేది. ఆ తర్వాత నుంచి తమిళంలో బిజీ అయిపోయింది. తెలుగులో అడిగినంత పారితోషికం ఇవ్వటం లేదనే ఆమె తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయిందని ఆమధ్య చెప్పుకొన్నారు. అయితే మళ్లీ `గోవిందుడు అందరివాడేలే`, `టెంపర్`ల కోసం టాలీవుడ్ కి వచ్చేసింది. ఆ రెండు చిత్రాల్లో కాజల్ కనిపించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక కాజల్ ఇలా ఇక్కడే సినిమాలు చేస్తే బాగానే ఉంటుంది కదా అనుకొన్నారంతా. కానీ ఆమె మళ్లీ తమిళ్ కి వెళ్లిపోయింది. అక్కడ రెండు మూడు సినిమాలు ఒప్పుకొంది. కానీ ఏ చిత్రంలోనూ సరైన పాత్ర దక్కలేదు. తాజాగా తెలుగు నుంచి క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకొంది. మహేష్‌తో `బ్రహ్మోత్సవం`లో నటించేందుకు ఒప్పుకొంది. ఈ సినిమాకి ఎంత పారితోషికం తీసుకొందో! మరి ఇక నుంచైనా కాజల్ మనసు మార్చుకొని టాలీవుడ్ లోనే కొనసాగుతుందా లేక మళ్లీ ఇదివరకటిలాగే తమిళ్ పై మోజు ప్రదర్శిస్తుందో చూడాలి.