Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా నుండి మహేష్‌ కోసం..

By:  Tupaki Desk   |   29 March 2016 10:37 AM IST
ఆస్ట్రేలియా నుండి మహేష్‌ కోసం..
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవం శరవేగంగా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ మూవీలో మహేష్ కి జంటగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సమంత - కాజల్ అగర్వాల్ - ప్రణీతా సుభాష్ లు మహేష్ తో ఆడిపాడబోతున్నారు. ఈ విషయం తప్ప... ఇప్పటివరకూ బ్రహ్మోత్సవంలో ఏ హీరోయిన్ పాత్ర ఏంటో, ఎవరు మెయిన్ హీరోయిన్ గా చేస్తున్నారనే అంశాలపై క్లారిటీ లేదు.

కానీ ఇప్పుడు చందమామ కాజల్ మాత్రం కొన్ని తన రోల్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ చెప్పింది. 'ఈ సినిమాలో నేను ఓ ఎన్నారై రోల్ చేస్తున్నాను. జస్ట్ ఆ మూడక్షరాలకే లిమిట్ అయ్యే కేరక్టర్ కాదు. డిఫరెంట్ కేరక్టరైజేషన్ తో ఆకట్టుకునే పాత్ర ఇది. చాలా కేజువల్ గా ఉంటూనే.. స్త్రీల హక్కుల గురించి మాట్లాడే రోల్. ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చి.. కొన్ని గోల్స్ ను అందుకునేందుకు పోరాడుతూ ఉంటాను. కలలు కనడమే కాదు.. ఆ కేరక్టర్ చాలా ప్రాక్టికల్ పర్సన్ కూడా' అని చెప్పింది కాజల్

'మహేష్ బాబుతో లాంటి స్టార్ హీరోతో రెండోసారి సినిమా చేసే అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. మా ఇద్దరి మధ్య టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదురుతుంది. మహేష్ - నా పాత్రల మధ్య వచ్చే సీన్స్ ఎంతో ఆకట్టుకుంటాయి.' అంటోంది కాజల్ అగర్వాల్.