Begin typing your search above and press return to search.

అలా చేస్తే చందమామ అయ్యేదే కాదు

By:  Tupaki Desk   |   15 July 2015 10:22 PM IST
అలా చేస్తే చందమామ అయ్యేదే కాదు
X
కాజల్‌ కెరీర్‌లో 'చందమామ' చిత్రం ఎంతో కీలకమైనది. కృష్ణవంశీ దర్శకత్వంలోని ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చేయడానికి కాజల్‌ నటనాభినయమే కారణం. అసలు చందమామ అన్న టైటిల్‌కి అర్థం కాజల్‌ అని ఒప్పుకున్నారంతా. అయితే అంతటి ముఖ్యమైన ఆ చిత్రం కాజల్‌ కెరీర్‌లో ఉండకపోయి ఉంటే? ఊహించడమే కష్టం కదూ? కానీ అలా జరిగి ఉండేదే అని చెబుతోంది కాజల్‌.

కాజల్‌ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న టైమ్‌లో కృష్ణవంశీ 'చందమామ' కథని వినిపించి ఓకే చేయించుకున్నారు. వాస్తవానికి ఆ కథ వినే టైమ్‌లోనే తమిళ్‌ నుంచి ఓ అద్భుతమైన అవకాశం కాజల్‌ని వరించింది. తమిళ సూపర్‌స్టార్‌ ధనుష్‌ సరసన 'పొల్లాధవన్‌'లో నటించే చాన్సొచ్చింది. కానీ కమిట్‌మెంట్‌ ముందు ఇక్కడ ఇచ్చేసింది కాబట్టి ఇక ఓకే చెప్పాల్సి వచ్చింది. అలా కాజల్‌ చందమామలో నటించింది. ఇన్నాళ్టికి సందర్భం వచ్చింది కాబట్టి గుట్టు విప్పింది కాజల్‌.

ఏ సినిమాని ఎంపిక చేసుకోవాలి? ఏ కథని ఎంపిక చేసుకుంటే కథానాయికగా గుర్తింపు వస్తుంది? అన్నది తెలుసుకుంటేనే మనుగడ. ఇందులో కాజల్‌ 100శాతం సక్సెసైంది కాబట్టే అంత మంచి సినిమాలో నటించగలిగింది. అన్నట్టు ఒకటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాక ఇప్పుడు ధనుష్‌ సరసన 'మారి' చిత్రంలో నటించే ఛాన్సొచ్చింది కాజల్‌కి. మారి ఈ శుక్రవారం తమిళ బక్సాఫీస్‌ వద్ద లక్‌ చెక్‌ చేసుకోనుంది. అదీ సంగతి.