Begin typing your search above and press return to search.
కాజల్ క్లాప్ కొట్టిన మేనేజర్ సినిమా
By: Tupaki Desk | 11 May 2019 4:25 PM ISTసాధారణంగా నటీనటులు నిర్మాతలుగా మారుతూ ఉంటారు. అరుదుగా వాళ్ళ క్రూ మెంబెర్స్ సినిమాలు తీయడం జరుగుతుంది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ మేనేజర్ గా వ్యవహరించిన రాన్సన్ ప్రొడ్యూసర్ గా మారి మను చరిత్ర అనే సినిమాను నిర్మించబోతున్నాడు. దీని ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. కాజల్ క్లాప్ కొట్టగా రాజ్ కందుకూరితో పాటు ఇతర యూనిట్ మెంబర్స్ హాజరయ్యారు.
తొలి షాట్ కు ఆరెక్స్ 100 అజయ్ భూపతీ దర్శకత్వం వహించగా నిర్మాత సి కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సాహు గారపాటితో పాటు సుధీర్ వర్మ స్క్రిప్ట్ ని అందజేశారు, శ్రీనివాస రెడ్డి మరో నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ మూవీ ద్వారా శివ కందుకూరి హీరోగా పరిచయమవుతున్నాడు. హీరోయిన్ గా లై-చల్ మోహన రంగా ఫేమ్ మేఘా ఆకాష్ నటిస్తోంది
మను చరిత్ర టైటిల్ ఆసక్తి రేపుతోంది. విభిన్నమైన బ్యాక్ డ్రాప్ తో భరత్ కుమార్ దీన్నో డెప్త్ లవ్ స్టోరీగా తీర్చి దిద్దుతున్నట్టు సమాచారం. డిమాండ్ పీక్స్ లో ఉన్న గోపి సుందర్ సంగీతం అందించడం మరో ఆకర్షణగా మారుతోంది. షూటింగ్ త్వరగానే పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్లానింగ్ చేసుకున్నారు. కాజల్ అగర్వాలే సమర్పకురాలిగా వ్యవహరించబోతోంది. పెళ్లి చూపులు లాంటి అభిరుచి కలిగిన సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న రాజ్ కందుకూరి అబ్బాయి శివని హీరోగా దీని త్వరగా పరిచయం చేస్తున్నారు.