Begin typing your search above and press return to search.

మొదలెట్టేశానంటూ కాజల్‌ ప్రకటన

By:  Tupaki Desk   |   20 Dec 2018 1:30 AM GMT
మొదలెట్టేశానంటూ కాజల్‌ ప్రకటన
X
హీరోయిన్‌ కాజల్‌ కెరీర్‌ ఎడ్డింగ్‌ కు వచ్చిందని భావిస్తున్న తరుణంలో ఆమె కు అనూహ్యం గా భారీ చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. దాదాపు అయిదు సంవత్సరాలుగా ఇలాగే జరుగుతూ వస్తుంది. కాజల్‌ ఇక సినిమాలు దక్కించుకోవడం కష్టమే అనుకుంటున్న సమయం లో కాజల్‌ కు ఏదో ఒక భారీ చిత్రం ఆఫర్‌ రావడం మళ్లీ కొంత కాలం ఆమె స్టార్‌ డంతో దూసుకు పోవడం జరిగుతుంది. స్టార్‌ హీరోలతో అవకాశాలు పెద్దగా లేక పోవడంతో చిన్న హీరోలతో వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చింది. కాజల్‌ తాజాగా ‘ఇండియన్‌ 2’ చిత్రం లో ఎంపిక అయ్యిందని వార్తలు వచ్చాయి.

ఆ మద్య కమల్‌ హాసన్‌ తో ఒక చిత్రం చేయబోతున్నట్లుగా సగం క్లారిటీ ఇచ్చిన కాజల్‌ ‘ఇండియన్‌ 2’ గురించి ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది. ‘ఇండియన్‌ 2’ కోసం ఈమె కళరియపట్టు అనే కళ నేర్చుకుంటుందట. అందుకు సంబంధించిన పుస్తకాలను కూడా ఆమె చదువుతుంది. తాజాగా ఆ కళ కు సంబంధించిన ఒక పుస్తకం ను ఆమె చదువుతూ ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. దాంతో పాటు మొదలైంది.. అంటూ కామెంట్‌ కూడా చేసింది.

ఇండియన్‌ 2 కోసమే కాజల్‌ అది చదువుతుందని, ఇప్పటి వరకు మార్షల్‌ ఆర్ట్స్‌ గురించి పెద్ద గా అవసరం పడని కాజల్‌ ఈసారి ఈ సినిమా కోసం చాలా కష్టాన్నే ఎదుర్కోబోతున్నట్లుగా చెబుతున్నారు. కమల్‌ హాసన్‌, శంకర్‌ ల కాంబినేషన్‌ లో అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందబోతున్న ‘ఇండియన్‌ 2’ మూవీ వచ్చే నెలలో పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది లేదంటే, 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.