Begin typing your search above and press return to search.
హే మ్యాడమ్.. ఈ ఛాయ్ గరీబుకి విందు ..!
By: Tupaki Desk | 12 July 2021 11:00 PM ISTఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్ .. ఈ ఛాయ్ ఛమక్కులే చూడరా భాయ్.. ఈ ఛాయ్ గరీబుకి విందురా భాయ్.. ఏ ఛాయ్ నవాబుకి విందు రా భాయ్..! .. `మృగరాజు`(2012) సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పాడి డ్యాన్సులు చేసిన సంగతిని మరువలేరు అభిమానులు.
యాథృచ్ఛికంగానే అయినా కాజల్ ప్రస్తుతం చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు అదే ఛాయ్ ని అలా ఆరాంగా ఆస్వాధిస్తోంది కాజల్. అలా చేతిలో పాట్ ఛాయ్ ని చూస్తున్నారు కదా..! ఇంతకీ ఇది ఏ సినిమా సెట్లో అంటే..?
కోల్ కతాలోని `ఉమా` మూవీ సెట్స్ లో కుల్హాద్ చాయ్ ని ఆస్వాధిస్తోంది కాజల్. `స్లైస్ ఆఫ్ లైఫ్` పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి తథాగత సింఘ దర్శకత్వం వహిస్తున్నారు. ఉమా అనే మహిళ చుట్టూ తిరిగే కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. కోల్ కతాలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాజల్ అగర్వాల్ ఆన్ లొకేషన్ నుంచి ఇన్ స్టా లో స్వయంగా ఈ ఫోటోని షేర్ చేశారు. కుల్ హాడ్ లో అలా టీ సిప్ చేస్తున్న కొన్ని ఫోటోలను పంచుకోగా వైరల్ అవుతున్నాయి. మిరాజ్ గ్రూప్ నుండి అవిషేక్ ఘోష్ - మంతరాజ్ పాలివాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ ఈ క్రేజీ హిందీ చిత్రం కోసం రూ .2 కోట్ల పారితోషికం అందుకుంటోంది. కెరీర్లో అత్యధిక వేతన చెక్ ఇది. ఈ మూవీతో పాటు ప్రస్తుతం హే సినమికా- ఆచార్య వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది. కమల్ హాసన్ ఇండియన్ 2 లోనూ కాజల్ నాయిక. లైకా ప్రొడక్షన్స్ తో దర్శకుడు శంకర్ వివాదం కారణంగా ఈ చిత్రం షూటింగ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.