Begin typing your search above and press return to search.
ఇంటి టెర్రాస్ పై హబ్బీతో ఫజిల్స్ వేస్తోందిట!
By: Tupaki Desk | 3 Jun 2021 7:00 AM ISTచందమామ కాజల్ అగర్వాల్ కొంతకాలంగా వరుస సెల్ఫీలతో చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ లో అభిమానుల కోసం నో మేకప్ సెల్ఫీని షేర్ చేశారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ కష్టకాలంలో కాజల్ అగర్వాల్ అభిమానులతో సానుకూల పోస్టులను పంచుకుంటున్నారు. ఇటీవల సెట్స్ పై ఉన్న ఆచార్య చిత్రానికి బ్రేక్ ఇవ్వడంతో కాజల్ కి కావాల్సినంత సమయం చిక్కింది. ప్రస్తుతం తాను భర్తతో కలిసి గృహనిర్భంధంలో ఉంది. పరిస్థితి నియంత్రణలో లేనప్పుడు ప్రతి ఒక్కరూ ఊపిరి గట్టిగా పీల్చుకోవాలని ఇది కష్టకాలమని కాజల్ వ్యాఖ్యానించారు.
తాజాగా షేర్ చేసిన ఫోటోలో వైట్ షర్ట్ .. కఫ్డ్ స్లీవ్స్ తో చినుగుల జీన్స్ ధరించి కనిపించారు. అలాగే భర్త గౌతమ్ కిచ్లుతో అనుబంధానికి చిహ్నంగా ఉన్న వేరొక ఫోటోని ఇన్ స్టాలో కాజల్ షేర్ చేశారు. ఈ ఫోటోకి మోసగాళ్లు అంటూ టైటిల్ పెట్టడం ఆసక్తికరం. ఇటీవలే మంచు విష్ణుతో కలిసి కాజల్ మోసగాళ్లు చిత్రంలో నటించగా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో కాజల్ తీరిక సమయాన్ని ఎలా గడుపుతోంది? అని ప్రశ్నిస్తే.. భర్త తో కలిసి పజిల్స్ పూర్తి చేస్తున్నారట. అది కూడా రాత్రులు తమ భవంతి టెర్రాస్ మీద ఆ పనిలో బిజీగా ఉన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి కాజల్ తమిళ చిత్రం హే సినమికలో దుల్కర్ సల్మాన్ - అదితి రావు హైడారితో కలిసి కనిపించనుంది. ఘోస్టీ అనే హర్రర్ కామెడీ లోనూ నటిస్తోంది. భారతీయుడు 2 లోనూ కాజల్ నాయిక. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ వివాదాల వల్ల నిలిచిపోయిన సంగతి తెలిసిందే.